వేతనాలు ఇప్పించండి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని ఏరియా హాస్పిటల్‌ లో సూపరిండెంట్‌ అజయ్‌ కుమార్‌కి ఏఐటియుసి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ హాస్పిటల్‌ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కామారెడ్డి, దోమకొండ, జక్కల్‌, ఎల్లారెడ్డి, మద్నూర్‌ హాస్పిటల్‌లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు ఉండవు కానీ సచివాలయ నిర్మాణానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయని వారు అన్నారు. వెంటనే కార్మికులకు మూడు నెలల జీతాలు చెల్లించాలని లేని పక్షంలో ఆందోళలనలకు సిద్ధమవుతామని వారు అన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పి.బాలరాజు, ఉపాధ్యక్షుడు శేఖర్‌, కార్మికులు రఫిక్‌, ఫాజియా, సందీప్‌, స్వరూప, నర్సింలు, నర్సవ్వ, మమత తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here