వేలాది మొక్కలు వృథా

0
5


వేలాది మొక్కలు వృథా


లారీని అడ్డుకొన్న గ్రామస్థులు,

సాటాపూర్‌గేటు(ఎడపల్లి), న్యూస్‌టుడే: ఓ లారీ నుంచి ఎండిపోయిన వేలాది మొక్కలను డంపింగ్‌ చేస్తుండగా సాటాపూర్‌గేట్‌ వద్ద స్థానికులు అడ్డుకున్న వైనమిది. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీలో ఎండిన మొక్కలను తీసుకెళ్తున్నారు. ఆదివారం ఎడపల్లి మండలం సాటాపూర్‌ గేటు ప్రాంతంలోని ఓ దాబా వద్ద వాహనాన్ని నిలిపారు. ఎక్కడైనా మొక్కలను డంపింగ్‌ చేసే అవకాశం ఉందా అని స్థానికులను అడిగారు. డంపింగ్‌ చేస్తే రూ.2 వేలు ఇస్తామని లారీ యాజమాని చెప్పారు. దీంతో కొందరు కూలీలు సాటాపూర్‌ గేటు శివారులో వాటిని డంప్‌ చేశారు. ఈ విషయం తెలుసుకొన్న దుబ్బతండా సర్పంచి దశరథ్‌ పలువురు గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకొన్నారు. లారీని అడ్డగించి మొక్కలను తిరిగి తీసుకెళ్లాలని పట్టుబడ్డారు. దీంతో డ్రైవర్‌, క్లీనర్‌ పడేసిన మొక్కలను వాహనంలో లోడ్‌ చేసుకొని వెళ్లిపోయారు.

సాటాపూర్‌గేటు ప్రాంతంలో పడేసిన మొక్కలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here