వైద్యుడు దాడి చేశారని గొడవ

0
0


వైద్యుడు దాడి చేశారని గొడవ

బోధన్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లగా వైద్యుడు తమపై దాడి చేసి గాయపర్చాడని నవదీప్‌ అనే యువకుడు మంగళవారం రాత్రి గొడవ చేశాడు. వాస్తవాలు తెలుసుకోవడానికి సీఐ రాకేష్‌ ఆస్పత్రికి వెళ్లి విచారణ నిర్వహించారు. వివరాలివీ.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రవీణ్‌ బోధన్‌కు చెందిన స్నేహితుడు నవదీప్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్దిరెడ్డి రైస్‌మిల్లు వద్ద జారిపడి గాయపడ్డారు. ఘటనలో కాలికి గాయమై రక్తమోడుతున్న నవదీప్‌ను వెంట ఉన్న కానిస్టేబుల్‌ మిత్రుడు ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే కాకుండా తనపై దాడి చేశారని ఆరోపించి కుర్చీలు ధ్వంసం చేశారు. విషయం తెలిసి సీఐ వచ్చారు. ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు మద్యం తాగి ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here