వైభవంగా జగన్నాథ రథయాత్ర

0
6


వైభవంగా జగన్నాథ రథయాత్ర

జగన్నాథరథాన్ని లాగుతున్న భక్తులు

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: హరే రామ.. హరే కృష్ణ.. జై గోవిందా..అంటూ నినాదాలతో నగరం మారుమోగింది. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఊరేగించారు. స్వామివారి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఇస్కాన్‌ నిజామాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. పులాంగ్‌ తితిదే కల్యాణ మండపం నుంచి ప్రారంభించారు. దారి పొడవునా కీర్తనలు ఆలపిస్తూ, భజనలు చేశారు. సామూహికంగా మహాహారతి సమర్పించారు. ప్రసాద వితరణలు చేపట్టారు. ఎల్లమ్మగుట్ట చౌరస్తా, తిలక్‌గార్డెన్‌, రాష్ట్రపతి రోడ్డు, దేవీరోడ్డు, రైల్వేగేట్‌, గుర్బాబాది రోడ్డు మీదుగా శ్రద్ధానంద్‌గంజ్‌ వరకు రథయాత్ర కొనసాగింది. ముగింపు వేదికపై సంస్థ ప్రతినిధులు హాజరై ధార్మిక ప్రవచనాలతో జగన్నాథుని మహిమలను వివరించారు. ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో సందడి నెెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి, బందోబస్తులో పాల్గొన్నారు.

రథంపై దేవతామూర్తుల విగ్రహాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here