వైరల్ వీడియో: ఫన్ టైం.. రోహిత్‌ కుమార్తెతో ధావన్‌!!

0
1


ఢిల్లీ: ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడిలలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు ముందుంటారు. ఇద్దరూ మైందనంలో పోటీపడుతూ బౌండరీలు, సిక్సులు బాదుతుంటారు. టాప్ బౌలర్లు కూడా వీరి బ్యాటింగ్ ముందు తేలిపోవాల్సిందే. ఈ జోడి బ్యాటింగ్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఢిల్లీ టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. దూబే అరంగేట్రం!!

రోహిత్‌, ధావన్‌ మైదానంలో సమన్వయంతో బ్యాటింగ్‌ చేయడమే కాకుండా.. బయటా కలిసిమెలిసి ఉంటారు. ప్రస్తుతం ఇద్దరు బంగ్లాదేశ్‌, టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగే తొలి టీ20 కోసం ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలో రోహిత్‌ కుమార్తె సమైరాతో కలిసి ధావన్‌ సరదాగా ఆడుకున్నాడు. తన తండ్రి ఒడిలో కూర్చొని ఉన్న సమైరాతో ధావన్ ఫన్ టైం ఎంజాయ్ చేసాడు.

తన తలపై చిన్నారి సమైరా చేయి పెట్టగానే వెనక్కి పడిపోతున్న వీడియోను ఆదివారం ధావన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘అందమైన సమైరాతో మస్తీ సమయం’ అని ధావన్ క్యాప్షన్‌లో రాశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అభిమానులు తెగ లైకులు కొడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ తండ్రి అయిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 529 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో నిలిచాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో టాప్ 10లో ఉన్న బ్యాట్స్‌మెన్లలలో తన పేరును కూడా లికించుకున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న బంగ్లా టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

డిల్లీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో రోహిత్ 9 పరుగులు చేసాడు. దీంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అధిగమించి టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంకు దూసుకొచ్చాడు. 2,452 పరుగులతో రోహిత్ మొదటి స్థానంలో ఉండగా.. 2,450 పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 72 మ్యాచుల్లో 2,450 పరుగులు చేస్తే.. రోహిత్‌ 99 మ్యాచుల్లో 2,452 పరుగులు చేసాడు.

View this post on Instagram

Some masti with adorable Samaira ❤ @rohitsharma45

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Nov 2, 2019 at 6:50am PDT

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here