వైసీపీలోకి వీవీ వినాయక్..!! జగన్ మాటలే స్పూర్తి అంటూ : ఆయన టార్గెట్ అదేనా..!!

0
3


వైసీపీలోకి వీవీ వినాయక్..!! జగన్ మాటలే స్పూర్తి అంటూ : ఆయన టార్గెట్ అదేనా..!!

ప్రమఖ దర్శకుడు వీవీ వినాయక్ రాజకీయాల్లోకి వస్తున్నారా. ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించారా. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దర్శకుడు వీవీ వినాయక్ వాస్తవంగా గత ఎన్నికల్లోనే వైసీపీ నుండి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే, అప్పుడు వైసీపీ అధినేత జగన్ తో రాయబారాలు నడిపినా అవి ఫలించలేదు. ఇక, తాజాగా వినాయక్ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వినాయక్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ మీద..ప్రత్యేకించి సీఎం జగన్ మీద ఉన్న అభిమానాన్ని స్పష్టం చేసాయి.

జగన్‌ మాటలే నటుడిని చేశాయి…

కాపు కార్పోరేషన్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో దర్శకుడు వీవీ వినాయక్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం 4 కోట్ల మందిలో సీఎం అయ్యే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అని జగన్‌ అన్నారని ఆ మాటలు తనకు బాగా నచ్చాయని సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. ఆ మాటలు స్ఫూర్తి నింపడం వల్లే నటుడిగా మారేందుకు జిమ్‌కు వెళ్లడం ప్రారంభించానని ఆయన చెప్పారు. అయితే, వినాయక్ సన్నిహితులు అనేక మంది వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నారు. ఇప్పటికే మరో దర్శకుడు పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్ విశాఖ జిల్లా నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. సినీ పరిశ్రమ నుండి వచ్చి ప్రస్తుతం ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఉన్న పృథ్వీతో కలిసి కార్యక్రమానికి వచ్చారు. గత ఎన్నికల సమయంలోనే వినాయక్ వైసీపీ నుండి ఎంపీ టిక్కెట్ ఆశించినట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన కొందరు మధ్యలో జగన్ వద్ద రాయబారం చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, విషయాన్ని వినాయక్ ఎక్కడా అధికారికంగా ప్రస్తావించలేదు. అయితే, ఇప్పుడు జగన్ మీద వినాయక్ చేస్తున్న వ్యాఖ్యలు..చూపిస్తున్న అభిమానం గమనిస్తే ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

ఎంపీగా అడుగు పెట్టాలనేది టార్గెట్ గా..

వినాయక్ ఎప్పుడూ రాజకీయాల గురించి ఓపెన్ గా మాట్లాడకపోయినా..ఆయనకు పార్లమెంట్ సభ్యుడు కావాలనే కోరిక ఉందని ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న కొందరు సినీ ప్రముఖులు చెబుతున్నారు. వినాయక్ గోదావరి జిల్లాల నుండి ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని…ఆయనకు అన్నీ కలిసొస్తే త్వరలోనే వైసీపీ లో అధికారికంగా చేరే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. అయితే, కేవలం జక్కంపూడి రాజా తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే వినాయక్ ఆ కార్యక్రమానికి వచ్చారని..ఆయన ప్రస్తుతం సినిమాల మీదనే శ్రద్ద పెట్టారని మరో నేత స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఈ ప్రముఖ దర్శకుడు రీల్ ఇండస్ట్రీని వదలి..రియల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఆయనే స్పష్టం చేయాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here