వైసీపీ కాకుంటే పించన్ కూడా ఇవ్వరా .. పించన్ అడిగితే మూకుమ్మడి దాడి చేస్తారా అంటున్న టీడీపీ

0
0


వైసీపీ కాకుంటే పించన్ కూడా ఇవ్వరా .. పించన్ అడిగితే మూకుమ్మడి దాడి చేస్తారా అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఇంకా గ్రామాల్లో పరిస్థితులు మాతం లేదు . గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు . దీంతో గ్రామాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది . అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిశాక కూడా కొనసాగుతున్నాయి.

పించన్ రాలేదని అడిగితే మా పార్టీ వాడివి కాదని ఇవ్వమని దాడి చేశారంటున్న టీడీపీ

వైసీపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో రెచ్చిపోయి మరీ దాడులకు దిగుతున్నారని ఒక పక్క టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.దాడులకు పాలప్డితే ఊరుకునేది లేదని తేల్చి చెప్తుంది. అయినప్పటికీ నేటికీ ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి . తాజాగా మరోసారి వైసీపీ నేతలు టీడీపీకి చెందిన వారిపై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా, బత్తలపల్లి మండలం, వెంకటగారిపల్లి గ్రామంలో జరిగింది. డేరంగుల రమణయ్య అనే వ్యక్తి తనకు రెండు నెలలుగా పింఛను రావడంలేదని మొరపెట్టుకుంటుంటే అక్కడున్న వైసీపీ వ్యక్తులు నువ్వు మా పార్టీ వాడివి కాదు నీకు పింఛను ఇవ్వము అంటూ అతనిపై దాడికి దిగారు. దీంతో రమణయ్య గాయపడి ఆస్పత్రి పాలయ్యారు అని టీడీపీ తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది.

టీడీపీ విమర్శలు చేస్తున్నా ఆగని దాడులు .. ట్విట్టర్ లో టీడీపీ అఫీషియల్ పేజ్ లో పోస్టులు

టీడీపీ విమర్శలు చేస్తున్నా ఆగని దాడులు .. ట్విట్టర్ లో టీడీపీ అఫీషియల్ పేజ్ లో పోస్టులు

తీవ్ర గాయాలపాలైన అతను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కులం చూడం, మతం చూడం, పార్టీని చూడం అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం అన్న ముఖ్యమంత్రి గారూ.. చూస్తున్నారా మీ కార్యకర్తల రౌడీయిజం అంటూ చేసిన ట్వీట్ లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమణయ్య వీడియో పోస్ట్ చేశారు. ఇక మొన్నటికి మొన్న జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, భీమవరంలో టిడిపికి ఓటేశారన్న అక్కసుతో పార్టీ కార్యకర్త శ్రీహరి ఇంటిని కూలగొట్టారు వైకాపా వర్గీయులు కూలగొట్టారని మరో పోస్ట్ చేశారు. ఇక ఇల్లు కూల్చివేసిన విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వైసీపీ అరాచకాలను ఖండించారు. తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీహరి కుటుంబానికి రూ.50వేల ఆర్ధిక సాయం అందజేశారు.

దాడులను ఖండిస్తున్న చంద్రబాబు .. అరాచాకపాలన అని ఆగ్రహం

దాడులను ఖండిస్తున్న చంద్రబాబు .. అరాచాకపాలన అని ఆగ్రహం

ఇక రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడులను ఖండించారు చంద్రబాబు . టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారన్నారు. వైసీపీ తరహాలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. ఇది అరాచక పాలన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here