వైసీపీ నేతలను మేపటానికేనా పాత ఇసుక విధానం రద్దు ?.. జగన్ పై సీరియస్ అయిన చంద్రబాబు

0
8


వైసీపీ నేతలను మేపటానికేనా పాత ఇసుక విధానం రద్దు ?.. జగన్ పై సీరియస్ అయిన చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. నిన్నటికి నిన్న ఆశ వర్కర్ల, ఏఎన్ఎం లను బెదిరించే ధోరణిలో జగన్ సర్కార్ పని చేస్తుందని ఆరోపణలు గుప్పించారు. వేధింపులు, మోసాలు తప్ప ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మిగిలింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఇక తాజాగా ఏపీలో భవన నిర్మాణ రంగం కుదేలవుతున్న పరిస్థితిని గురించి ఆయన విమర్శలు గుప్పించారు.

ఏపీలో ఇసుక కొరతపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు

ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకువచ్చిన ఇసుక విధానంలో సామాన్య ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్న అభిప్రాయం ఉంది. ఇసుక కొరతతో నిర్మాణ రంగం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పనులు దొరక్క నిర్మాణ రంగ కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నిర్మాణాలు ఆలస్యం అవుతుండటంతో కొనుగోలుదారులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొనుగోళ్ల పై ఆసక్తి చూపించడం లేదు. దీంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీ లోని బిల్డర్లు. ఇక ఇదే విషయంపై చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

బాధ్యతాయుత స్థానంలో ఉండి మొండిగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదన్న చంద్రబాబు

బాధ్యతాయుత స్థానంలో ఉండి మొండిగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదన్న చంద్రబాబు

బాబు ముందుగా సరైన ప్రణాళిక లేకుండా పాత ఇసుక విధానం రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త ఇసుక విధానం ఎప్పుడో తీరికగా వస్తుందట.. ఏంటి ఈ పిల్లల ఆటలు అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

వ్యవస్థలో మార్పులు ఆహ్వానించదగ్గవే అయినా వాటిని అమలు చేయాలనుకున్నప్పుడు ముందుగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ మార్పుల సాధ్యాసాధ్యాలపై బేరీజు వేసుకోవాలని చంద్రబాబు తెలిపారు . బాధ్యతాయుత స్థానంలో ఉండి మొండిగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని బాబు అన్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటికి తగిన పర్యవసనాలు ఆలోచించారా ? అంటూ జగన్ ను నిలదీశారు. ఈ కొత్త ఇసుక విధానం ఆలస్యం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ఇసుక 10 వేల రూపాయలు అంటే వైసీపీ నేతలను మేపడానికే పాత విధానాన్ని రద్దు చేశారా అంటూ విమర్శలు గుప్పించారు.

కొత్త ఇసుక విధానం ఎప్పుడో వస్తుందట ... ఏమిటీ పిల్లల ఆటలు అని ప్రశ్నించిన చంద్రబాబు

కొత్త ఇసుక విధానం ఎప్పుడో వస్తుందట … ఏమిటీ పిల్లల ఆటలు అని ప్రశ్నించిన చంద్రబాబు

ఇక చంద్రబాబు నాయుడు ఇసుక పాలసీ పై చేసిన ట్వీట్లు చూస్తే ” వ్యవస్థలో మార్పు తేవాలంటే ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకుని, సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని, అప్పుడు పాత వ్యవస్థను రద్దు చేయడమో , మార్పు చేయడము చెయ్యాలి. అదేమీ లేకుండా వచ్చీరావడంతోనే పాత ఇసుక విధానాన్ని రద్దు చేసేశారు. ఇక కొత్త విధానం ఎప్పుడో తీరిగ్గా వస్తుందట.. ఏమిటీ పిల్లల ఆటలు?” అని ట్వీట్ చేసిన చంద్రబాబు వెంటనే మరో ట్వీట్ కూడా చేశారు. “బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, మొండిగా నిర్ణయాలు తీసుకోవడమేనా? పర్యవసానాలు ఆలోచించక్కర్లేదా ? ఇసుక కొరత మూలంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రజల సొంతింటి కలను కడతేరి పోయాయి. ట్రాక్టర్ ఇసుక 10000 అంటే వైసీపీ నేతలను మేపటానికేగా ఇదంతా ? ” అంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు ఇంతవరకూ కొత్త ఇసుక పాలసీ రాకపోవడంపై, పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here