వ్యాలెట్ వినియోగదారులకు శుభవార్త… ఇక మీ సమస్యలకు మరింత వేగంగా పరిష్కారం

0
1


వ్యాలెట్ వినియోగదారులకు శుభవార్త… ఇక మీ సమస్యలకు మరింత వేగంగా పరిష్కారం

మొబైల్ వ్యాలెట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో వినియోగం అత్యధికంగా జరుగుతోంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా వీటి వినియోగం విస్తరిస్తోంది. వినియోగదారులను పెంచుకోవడానికి డిజిటల్ వ్యాలెట్ సంస్థలు ప్రచారం పెద్దఎత్తున జరుపుతున్నాయి. దీనివల్ల వినియోగదారుల్లో అవగాహన పెరిగి వినియోగానికి అలవాటు పడుతున్నారు.

అయితే ఈ లావాదేవీల విషయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని వేగవంతంగా పరిష్కరించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. కస్టమర్ల సమస్యలను మరింత ప్రభావవంతంగా, కాలవ్యవధిలో పరిష్కారం కావాలని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీ ఐ) భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రీ పెయిడ్ ఇన్ స్ట్రుమెంట్ ఇష్యుయెర్స్ కు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ సంస్థలు తమ కస్టమర్ల సమస్యలను పరిష్కరించడానికి అంతర్గత అంబుడ్స్ మన్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

జోరుగా వృద్ధి..

* ప్రీ పెయిడ్ ఇష్యుయర్ అంటే మొబైల్ వ్యాలెట్ సంస్థ. పేటీఎం, మోబిక్విక్, పే యు, ఫోన్ పే, అమెజాన్ పే వంటివి.

* స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, అందుబాటు ధరల్లోనే మొబైల్ డేటా లభించడం వల్ల వ్యాలెట్ల వినియోగం వేగవంతంగా పెరిగిపోతోంది. లావాదేవీలు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా డిజిటల్ లావాదేవీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల వీటికి ఆదరణ ఎక్కువ అవుతోంది.

టెక్నికల్ సమస్యలతో లావాదేవీలు విఫలం

టెక్నికల్ సమస్యలతో లావాదేవీలు విఫలం

* అయితే కొన్ని రకాల టెక్నికల్ సమస్యల వల్ల వినియోగదారుల లావాదేవీలు విఫలమవుతున్నాయి. కొన్ని రకాల మోసాలు కూడా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు వేగవంతంగా పరిష్కరించక పోతే కస్టమర్లకు నష్టం జరుగుతుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్గత అంబుడ్స్ మన్ అవసరం తప్పని సరిగా ఉందని ఆర్ బీ ఐ చెబుతోంది. కస్టమర్ల సమస్యలను ప్రభావ వంతంగా, నిర్ణీత కాలంలో పరిష్కరించాలని అంటోంది.

* ఈ మేరకు అన్ని వాలెట్ సంస్థలు తప్పనిసరిగా అంతర్గత అంబుడ్స్ మన్ ను ఏర్పాటు చేయాలి. అంతర్గత అంబుడ్స్ మన్ కు సంభందించిన మరిన్ని ఆదేశాలను ఈ నెల 15 న ఆర్ బీ ఐ జారీ చేయనుంది.

ఇప్పటికే డిజిటల్ అంబుడ్స్ మన్

ఇప్పటికే డిజిటల్ అంబుడ్స్ మన్

* డిజిటల్ లావాదేవీలకు సంభందించిన పిర్యాదులు, పరిష్కారాల కోసం భారత రిజర్వ్ బ్యాంక్ గత జనవరిలోనే అంబుడ్స్ మన్ స్కీం ను ప్రకటించింది.

* వ్యాలెట్ సంస్థలు కస్టమర్ నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాతి 30 రోజుల్లో దాన్ని పరిష్కరించకపోయినా, ఫిర్యాదును తిరస్కరించినా, సంతృప్తికరమైన స్పందనను ఇవ్వకపోయినా ఆ కస్టమర్ అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయవచ్చు.

* ఫండ్స్ లోడ్ చేసినప్పుడు ఆ లావాదేవీ విఫలమైనా కస్టమర్ ఫిర్యాదు చేయవచ్చు. అనధికారిక ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాస్ఫర్, రిఫండ్ చేయడంలో విఫలం కావడం, నిర్దేశిత కాలంలో నిధులను బదిలీ చేయడంలో విఫలం కావడం వంటివి అంబుడ్స్ మన్ పథకం కిందకు వస్తాయి.

ఉభయ తారకం

ఉభయ తారకం

* కొన్ని వ్యాలెట్ కంపెనీలు ఇప్పటికే కస్టమర్ల సమస్యల పరిష్కారానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నప్పటికీ ఇప్పుడు వాటిని అధికారికంగా నిర్వహించాల్సి ఉంటుంది.

* ఇందుకు సంభందించి తాజాగా ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలు అటు కంపెనీలకు, ఇటు కస్టమర్లకు ఉభయతారకంగా ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here