శాలరైడ్‌కు ఊరట!: IT రిటర్న్స్ గడువును పొడిగిస్తారా, 4 కారణాలు!!

0
4


శాలరైడ్‌కు ఊరట!: IT రిటర్న్స్ గడువును పొడిగిస్తారా, 4 కారణాలు!!

న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. డెడ్ లైన్ లోగా ITR ఫైల్ చేయడం తప్పనిసరి అని తెలుసుకోండి. ఫైల్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, ఫైల్ చేయకుంటే అన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జూలై 31వ తేదీలోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. గడువులోగా ఫైల్ చేయకుంటే ఫైన్ ఉంటుంది. అయితే, పలు కారణాల వల్ల ఐటీ రిటర్న్స్ ఫైల్ తేదీ పొడిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, ఇలాంటి వాటిని పక్కన పెట్టి సాధ్యమైనంత త్వరగా ITR ఫైల్ చేయడం మాత్రం మీకే మంచిదనే విషయం గుర్తుంచుకోండి. ఇక, ఐటీఆర్ ఫైలింగ్ తేదీని పొడిగించే అవకాశాలను చూద్దాం…

ఐటీ రిటర్న్స్ గడువు పొడిగిస్తారా?

గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకుంటే గరిష్టంగా రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు. దీనిపై పలువురు ఆందోళన చెందుతున్నారు. వీరందరికీ ఊరట కలిగించే నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) తీసుకుంటుందని ఆశిస్తున్నారు. ఉద్యోగులకు ఫాం 16 ఆలస్యం కావడం, వాటిలో తప్పులు గుర్తించి సవరించిన డాక్యుమెంట్స్‌ను కంపెనీల నుంచి తిరిగి పొందేందుకు మరింత సమయం అవసరమైనందున గడువు తేదీని పొడిగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

జూలై 31వ తేదీలోగా ఫైల్ చేయండి

జూలై 31వ తేదీలోగా ఫైల్ చేయండి

ఈ మేరకు చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) సంఘాలు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ, CBDT సానుకూలంగా స్పందించవచ్చునని భావిస్తున్నారు. అయితే గడువు తేదీ పొడిగింపుపై ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిదని కూడా చెబుతున్నారు. CBDT ఇష్యూ చేసిన దాని ప్రకారం యాజమాన్యాలకు ఐటీ రిటర్న్స్‌కు డెడ్ లైన్ మే 31 నుంచి జూన్ 30కి పొడిగించారు. వేతనజీవులకు జూలై 10వ తేదీలోపు ఫాం 16 ఇష్యూ చేయాలి. ఉద్యోగులు తమ ఐటీ రిటర్న్స్‌ను జూలై 31లోపు దాఖలు చేయాలి. అంటే గడువు 21 రోజులు మాత్రమే.

ఐటీఆర్ ఫైలింగ్ తేదీని పొడిగిస్తే మంచిది

ఐటీఆర్ ఫైలింగ్ తేదీని పొడిగిస్తే మంచిది

CBDT ఫారం 16, TDS రిటర్న్స్‌ను (ఫారం 24Q) రివైజ్ చేసిందని ట్యాక్స్2విన్ డాటిన్ సీఈవో అభిషేక్ సోని అన్నారు. ‘చాలామంది ట్యాక్స్ చెల్లింపుదారులు ITR దాఖలు చేయవలసిన తేదీని పొడిగిస్తున్నారా లేదా అని అడుగుతున్నారు? మా అభిప్రాయం మాత్రం ITR దాఖలు చేసే తేదీని పొడిగించడం మంచిది. యాజమాన్యం ఫారం 16 జారీ చేయవలసిన తేదీని CBDT జూన్ 15వ తేదీ నుంచి జూలై 10వ తేదీకి పొడిగించింది. కాబట్టి పన్ను చెల్లింపుదారులకు వారి ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తగిన సమయం ఇవ్వడానికి, రిటర్న్ ఫైలింగ్ తేదీని పొడిగించాలి.’ అని ఆయన అన్నారు. ఇది మొదటి కారణంగా చెబుతున్నారు.

మరో కారణం..

మరో కారణం..

ఫారం 16 సవరించారని, కాబట్టి వేతనజీవులకు కాస్త సమయం ఇవ్వాలని, అప్పుడే వారు ఎర్రర్స్ సరిగ్గా చూసుకోగలరని చెబుతున్నారు. యాజమాన్యం జారీ చేసిన ఫాం 16లో లోపాలు గుర్తించేందుకు ఉద్యోగులకు సమయం పడుతుందని, ఆ తర్వాత దానిని యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లాలని, అప్పుడు యాజమాన్యం దానిని సరిచేసి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ తతంగానికి సమయం తీసుకుంటుందని, కాబట్టి ఈ కారణంతో కూడా తేదీని పొడిగించాలని సోనీ చెప్పారు.

మూడు.. నాలుగు కారణాలు

మూడు.. నాలుగు కారణాలు

ఈసారి ఐటీఆర్ ఫైలింగ్ వివరాల్లో మరింత సమాచారం కోరారని, ఈ మూడో కారణంతోను పొడిగించే అవసరం ఉందని చెప్పారు. ‘ఐటీ రిటర్న్స్ ఫాంలలో మార్పులు మరియు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన అదనపు రిపోర్టింగ్ అవసరాల దృష్ట్యా, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సమాచారాన్ని సరిగ్గా రిపోర్ట్ చేయడానికి ఎక్కువ సమయం కావాలి, అవి సులభంగా అర్థమయ్యేది కాదు’ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ-రిటర్న్స్ దాఖలుతో వెబ్ సైట్స్ డౌన్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని, కాబట్టి ఈ నాలుగో కారణంతోనూ ఐటీ ఆర్ ఫైలింగ్ తేదీని మార్చవలసి ఉంటుందని చెబుతున్నారు. అయితే, CBDT ఇచ్చిన గడువు జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిది. ఎందుకంటే గడువు పొడిగిస్తారో లేదో తెలియదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here