శాస్త్రీయ విద్యాకోసం ఉద్యమం

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల శాస్త్రీయ విద్యాకోసం (ఏఐఎస్‌బి) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ క షి చేస్తుందని జిల్లా కన్వీనర్‌ భైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించాలన్నారు. శాస్త్రీయ విద్యను సక్రమంగా అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఉన్నత పాఠశాలలో, కళాశాలలో సిబ్బంది, మౌలిక వసతులు కూడా సరిగా లేవని అన్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఇకనైనా ముఖ్యమంత్రి కెసిఆర్‌ విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో పెట్టుకొని పీజులు, కాస్మోటిక్‌ ఛార్జిలు, స్కాలర్షిప్‌లు సకాలంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలపై (ఏఐఎస్‌బి) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ ఎల్లపుడు అలుపెరుగనిపోరాటం చేస్తోందని జిల్లా కన్వీనర్‌ భైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here