శిథిలమై ఉన్నాను.. చిత్తగించండి

0
1


శిథిలమై ఉన్నాను.. చిత్తగించండి


రంగు వెలిసి శిథిలావస్థకు చేరిన భవనం

మోపాల్‌, న్యూస్‌టుడే: ఈ చిత్రంలో రంగు వెలిసి, పెచ్చులూడి, శిథిలావస్థకు చేరి కనిపిస్తున్న నేను నగర శివారులోని బోర్గాం(పి) గ్రామానికి చెందిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని. గ్రామంలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం నిర్వహించిన ఆరోగ్య ఉపకేంద్రం కోసం నన్ను నిర్మించారు. కాలక్రమంలో మండలంలోని ముదక్‌పల్లి సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కావడంతో నా చెంతన ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని ఎత్తివేశారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఆరోగ్య కేంద్రం కొనసాగినంత కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిన నా జీవనం ఆరోగ్య కేంద్రం తరలిపోయిన తర్వాత కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. నాతో పని ఉన్నంత కాలం నాకు రంగులు వేసి, చిన్నచిన్న మరమ్మతులు చేసి కంటికి రెప్పలా కాపాడుకున్న అధికారులు ఇప్పుడు నావైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దాదాపు దశాబ్దకాలంగా నాకు ఎటువంటి చేయూతను అందించకపోవడంతో నా శరీరంలోని అవయవాలు జవసత్వాలు(భవన గోడలు) చచ్చుబడిపోయి, పగుళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం నా జీవితం ఊరు పొమ్మంది..కాడు రమ్మన్నట్టుంది అన్న చందంగా అధికారుల ఆదరణకు నోచుకోక పడిపోవడానికి సిద్ధంగా ఉంది. చివరి క్షణంలోనైనా అధికారులు కనికరించి నాకు మరమ్మతులు చేస్తే మరికొంతకాలం సేవలు అందించడానికి అనుకూలంగా ఉన్నా..అధికారులు పరిశీలిస్తారు..కదూ



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here