షకలక శంకర్ ‘2+1’.. మరో పదేళ్లు గుర్తుండిపోయే పాత్రలట..!

0
1


‘జబర్దస్త్’ కామెడీ షోలో శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ కామెడీ పండించిన షకలకల శంకర్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యారు. తరవాత ఆ షో నుంచి బయటికి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. తొలుత కమెడియన్‌గా కొన్ని సినిమాల్లో కనిపించిన శంకర్.. తరవాత హీరో అవతారం ఎత్తారు. ‘శంభో శంకర’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఈ సినిమా అస్సలు ఆకట్టుకోలేకపోయింది.

ఆ తరవాత ‘డ్రైవర్ రాముడు’ సినిమా మొదలుపెట్టారు. టీజర్ కూడా విడుదల చేశారు. కానీ, ఆ సినిమా ఏమైందో ఎప్పుడొస్తుందో తెలీదు. అయితే, ఇప్పుడు ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు శంకర్ సిద్ధమవుతున్నారు. శంకర్ హీరోగా కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘2+1’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను దసరా కానుకగా, సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 6న విడుదల చేస్తున్నారు.

Also Read: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన చిరంజీవి.. ‘సైరా’ చూడండంటూ ఆహ్వానం

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కాచిడి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శంకర్‌ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాం. మాస్ క్యారెక్టర్‌తో పాటుగా క్లాస్ టచ్ ఉన్న స్టూడెంట్ పాత్ర ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది. మరో పది సంవత్సరాల పాటు గుర్తుండిపోయే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు ఈ సినిమాలో శంకర్ పోషించారు. దర్శకుడిగా నా మొదటి సినిమాకు శంకర్ లాంటి మంచి హీరో దొరకడం, నిర్మాతలు నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం నా అదృష్టం’’ అని అన్నారు.

హీరో శంకర్ మాట్లాడుతూ.. ‘‘నన్ను కొత్త యాంగిల్‌లో చూపించబోతున్న దర్శకుడు గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ‘శంభో శంకర’ సినిమా తర్వాత ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌లో సురేష్ కొండేటి గారితో మళ్లీ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూ‌స్‌తో ప్రతిష్టాత్మకంగా, నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

Also Read: ‘సైరా’ 2 వేల కోట్లా? తమ్మారెడ్డి సెటైర్లపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

ఇప్పటి వరకు 80 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలో ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో మూడు పాటలు, కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో మిగిలిన 20 శాతం షూటింగ్ పూర్తవుతుందని నిర్మాతలు వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో శంకర్‌కు జోడీగా రుబికా, ఆక్సాఖాన్ నటిస్తున్నారు. హరిగౌర సంగీతం సమకూరుస్తున్నారు. మొటం సతీష్ సినిమాటోగ్రాఫర్. నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here