షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ఎంపికలు నేడు

0
3


షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ఎంపికలు నేడు

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలకు అండర్‌-17 బాలబాలికల విభాగాల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు హాజరు కావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆఫీసర్‌ క్లబ్‌లో శుక్రవారం ఉదయం 9గంటలకు నిర్వహించే ఎంపికలకు బోనఫైడ్‌తో హాజరు కావాలని పేర్కొన్నారు. ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో కేటగిరిలో ఇద్దరు క్రీడాకారులు రావాలని సూచించారు.

జిల్లాస్థాయి పోటీలకు…

నిజామాబాద్‌ క్రీడావిభాగం: ఖోఖో జిల్లాస్థాయి పోటీలకు అండర్‌-17 బాలబాలికల విభాగాల్లో క్రీడాకారులు హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(నందిపేట)లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో జోనల్‌ స్థాయి జట్లకు మాత్రమే అర్హత ఉందని సూచించారు.

ఈ నెల 2న అంతర్‌ జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక

నిజామాబాద్‌ క్రీడావిభాగం: జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంతర్‌ జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో ప్రాతినిధ్యం వహించడానికి 2న ఉదయం 9:30 గంటలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక చేయనున్నట్టు అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రత్నాకర్‌, రాజాగౌడ్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు తిరుపతిలో ఈనెల 21 నుంచి 26 వరకు అంతర్‌ జిల్లాస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో నిర్వహించే ఎంపికలకు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు అసలు పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. పాఠశాలల నుంచి తీసుకొచ్చిన ధ్రువపత్రాలు చెల్లవని తెలిపారు.

ఎంపికల విభాగాలు

అండర్‌-14 బాలబాలికల విభాగంలో 26 నవంబరు 2005 నుంచి 25 నవంబరు 2007 మధ్యలో జన్మించి ఉండాలి. అండర్‌-16 బాలబాలికల విభాగంలో 26 నవంబరు 2003 నుంచి 25 నవంబరు 2005 మధ్యలో జన్మించాలి.

నిజామాబాద్‌ క్రీడావిభాగం: కరాటే అండర్‌-17 బాలబాలికల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో ఉదయం 10గంటలకు బోనఫైడ్‌, జనన ధ్రువీకరణపత్రం, గతేడాది మార్కుల పత్రం, ఆధార్‌కార్డ్‌ నిజ పత్రాలతో పాటు మూడు జతల నకలు పత్రాలు, నాలుగు పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోలతో రావాలని పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు విద్యార్థి ఎంపిక

గాంధారి, న్యూస్‌టుడే: బామన్‌ నాయక్‌ క్రీడా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్న భానుకిరణ్‌గౌడ్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు సేవంత రాఠోడ్‌ గురువారం తెలిపారు. భానుకిరణ్‌గౌడ్‌ గాంధారి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్‌ చదువుతున్నాడు. పొతంగల్‌ పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిరంతరం ఉచిత శిక్షణ కొనసాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నవంబరు 2 నుంచి 4 వరకు భద్రాచలంలో నిర్వహించనున్న ఎస్‌జీఫ్‌ అండర్‌-17 రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో నిజామాబాద్‌ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారుడిని వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌ రాఠోడ్‌, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

పొతంగల్‌ కలాన్‌(గాంధారి గ్రామీణం): పొతంగల్‌కలాన్‌ ఉన్నత పాఠశాలకు చెందిన సందీప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నెమ్లిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చారు.

క్రీడాకారులు ధ్రువపత్రాలతో హాజరుకావాలి

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌(అండర్‌-17 బాలురు), కుస్తీ(ఫ్రీస్టైల్‌ అండర్‌-14 బాలికలు) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో బాస్కెట్‌బాల్‌, కుస్తీ క్రీడాకారులు సాయంత్రం 5గంటలకు, వాలీబాల్‌ క్రీడాకారులు సాయంత్రం 4గంటలకు హాజరుకావాలని సూచించారు. బోనఫైడ్‌, జనన ధ్రువీకరణపత్రం, గతేడాది మార్కుల పత్రం, ఆధార్‌కార్డు నిజ పత్రాలతో పాటు మూడు జతల నకలు పత్రాలు, నాలుగు పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోలు వెంట తీసుకొని రావాలని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here