షాకింగ్.. రాయి దెబ్బకు బాలుడిగా మారిపోయిన 34 ఏళ్ల వ్యక్తి!

0
2


రేళ్ల వయస్సులో స్నేహితులతో ఆడుకుంటున్న అతడి తలకి రాయి తగిలింది. అంతే, అప్పటి నుంచి అతడికి కొత్త సమస్య మొదలైంది. వయస్సు పెరగడం ఆగిపోయింది. ఆ వయస్సులో అతడు ఏ రూపంలో ఉన్నాడో.. ఇప్పుడూ అదే రూపంలో ఉన్నాడు. దీంతో అతడిని ఎవరూ పెద్దవాడిగా చూడటం లేదు. అంతా అతడిని చిన్నపిల్లాడనే అనుకుంటున్నారు. ఈ సమస్య వల్ల అతడికి పెళ్లి కూడా కుదరడం లేదు.

చైనాలోని క్సియాంటావు నగరంలో నివసిస్తున్న జు షెంగకాయ్‌కు ఏర్పడిన ఈ అరుదైన సమస్యను చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. సాధారణంగా జన్యు సంబంధిత సమస్యలు ఎదుర్కొనే పిల్లలు మరుగుజ్జులుగా మారే అవకాశం ఉంటుంది. అయితే, వారి వయస్సు పెరుగుదల ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read: ఫోన్ చూస్తూ రైల్వే ట్రాక్‌పై పడ్డ మహిళ.. అదే సమయంలో ప్లాట్‌ఫాం మీదకు రైలు

షెంగకాయ్‌కు విషయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అతడికి 34 ఏళ్లు వచ్చినా అతడి ముఖం ఇంచా చిన్నపిల్లాడిలాగే ఉంది. ఈ సందర్భంగా అతడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘రాయి తగిలిన తర్వాత అతడి తలకి ఎలాంటి గాయం కాలేదు. రక్తస్రావం కూడా జరగలేదు. అయితే, మూడు రోజులు తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యులు రాయి తగలడం వల్ల మెదడులో రక్తం గడ్డ కట్టిందని తెలిపారు. ఆ తర్వాత సర్జరీ చేసి గడ్డను తొలగించారు. ఆ తర్వాత అతడికి ఎలాంటి సమస్య రాలేదు’’ అని తెలిపారు.

అతడికి తొమ్మిదేళ్ల వయస్సు వచ్చినా అతడి ముఖం చిన్న పిల్లాడిలాగే ఉండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతడి పీయూష గ్రంధి దెబ్బతిన్నట్లు గుర్తించారు. దాని వల్ల అతడి శరీరక ఎదుగుదల ఆగిపోయిందని తెలిపారు. దీంతో అతడికి 34 ఏళ్లు వచ్చినా చిన్న పిల్లాడిలాగానే కనిపిస్తు్న్నాడు. అతడితో పాటు చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు. అయితే, అతడు మాత్రం ఇంకా పిల్లాడిలాగే ఉండిపోయాడు.

Also Read:
ఊదా రంగులో మారిన మూత్రం.. షాకైన వైద్యులు, కారణం ఇదేనట!

షెంగకాయ్‌ ఇంకెప్పుడూ బాయ్‌గానే ఉండిపోతానని అంటున్నాడు. తన స్నేహితులకు వృద్ధాప్యం వచ్చి ముఖం మీద ముడతలు వస్తాయని, తాను మాత్రం ఎప్పుడూ ఇలా క్యూట్‌గా చిన్నపిల్లాడిలా ఉండిపోతానని అంటున్నాడు. అయితే, తన ఎదుగుదల ఆగిపోవడం వల్ల ఎవరూ తనని పెద్దవాడిగా గుర్తించడం లేదని, తనను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదని తెలిపాడు. మానవ శరీరంలో పియూష గ్రంథి కీలక పాత్ర పోషిస్తోంది. మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆ గ్రంథిని కోల్పోవడం వల్ల అతడి వయస్సు కూడా ఆగిపోయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here