షేక్‌ అవుతున్న బాక్సాఫీస్‌.. `విజిల్‌` వేస్తున్న విజయ్‌ ఫ్యాన్స్‌

0
2


కోలీవుడ్ టాప్‌ హీరో విజయ్‌ మరోసారి బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటాడు. వరుసగా వంద కోట్ల సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ఈ క్రేజీ స్టార్‌ బిగిల్‌తో తన మార్కెట్‌ రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ బిగిల్‌ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

See Photo Story: వైజాగ్ పోరి ఈ ‘కుందనపు బొమ్మ’..చాందిని చౌదరి

విజయ్‌ హీరోగా గతంలో తేరి, మెర్సల్‌ చిత్రాలను తెరకెక్కించిన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఈ ఇద్దరు హ్యాట్రిక్‌ సక్సెస్‌ను సాధించారు. విజయ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహిళా క్రీడాకారుల సమస్యలను ప్రధానంగా చర్చించారు.

Also Read: `నా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్‌`.. లెజెండరీ డైరెక్టర్‌కు పంచ్‌!

విజయ్‌ మార్క్‌ మాస్‌ ఎలిమెంట్స్‌కు అట్లీ స్టైల్‌ ఎమోషనల్‌ టేకింగ్‌ తోడై బిగిల్‌ ఆడియన్స్‌ను తెగ నచ్చేసింది. తొలిరోజు కాస్త నెగెటివ్‌ టాక్‌ వినిపించినా అన్నింటినీ వెనక్కి నెట్టి బిగిల్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తొలి భాగం కాస్త స్లో అయ్యిందన్న టాక్‌ వినిపించినా ద్వితీయార్థంలో ఉన్న ఎమోషనల్‌ కంటెంట్ సినిమాను విజయతీరాలకు చేర్చింది. దీంతో సినిమాకు సూపర్‌ హిట్ టాక్‌ వచ్చింది.

Also Read: సూపర్‌ స్టార్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ దర్శకుడికి మరో ఛాన్స్‌!

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమా రికార్డ్‌ సృష్టించింది బిగిల్‌. ఇన్నాళ్లు ఈ రికార్డ్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట పేరున్న ఉండేంది. బిగిల్‌ సక్సెస్‌ పేట రికార్డ్‌ వెనక్కెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బిగిల్‌ హవా కనిపిస్తుంది. తెలుగులో విజిల్‌ పేరుతో రిలీజ్‌ అయిన బిగిల్‌ పది రోజుల్లో 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో విజయ్‌కి ఇది మంచి రికార్డే. ఓవర్‌ సీస్‌లోనూ బిగిల్ మంచి వసూళ్లు సాధిస్తుండటం, తమిళనాట చాలా చోట్ల ఇంకా హౌస్‌ ఫుల్ కలెక్షన్లు వస్తుండటంతో బిగిల్‌ ముందు ముందు మరిన్ని రికార్డులు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.
Also Read: సెన్సార్‌ పూర్తిచేసుకున్న `తిప్పరా మీసం`, నవంబర్‌ 8న రిలీజ్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here