షోయబ్ మాలిక్, మహమ్మద్ హఫీజ్‌లకు పాకిస్థాన్ బోర్డు మొండిచెయ్యి

0
0


హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్లు షోయబ్ మాలిక్, మహమ్మద్ హఫీజ్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మొండిచెయ్యి చూపించింది. 2019-20 సీజన్‌కు సంబంధించి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుంచి ఈ ఇద్దరు క్రికెటర్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పించింది.

ఇక, ప్రస్తుత కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, బ్యాట్స్‌మన్ బాబర్ అజాం, లెగ్ స్పిన్నర్ యాసిర్ షా తన కేటగిరీ ఏ కాంట్రాక్టుని తిరిగి దక్కించుకున్నారు. టెస్టు ఓపెనర్ అజర్ అలీ, ఇటీవలే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెప్ట్ ఆర్మ్ పేసర్ మహ్మద్ ఆమీర్‌లను కేటగిరీ B, Cలలోకి చేర్చింది.

బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్ షెడ్యూల్ విడుదల

సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా కుదింపు

సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా కుదింపు

అంతేకాదు గతంలో ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను కూడా కుదించింది. గతంలో ఆటగాళ్ల సంఖ్య 33 కాగా, ఇప్పుడు దానిని 19కి కుదించింది. ఈ సీజన్‌లో పాకిస్థాన్ పురుషుల జట్టు 6 వరల్డ్ టెస్టు ఛాంపియన్ టెస్టుల, 3 వన్డేలు, 9 టీ20లు ఆడనుంది.

ఆర్చర్‌ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్‌ రెండో టెస్టులో చోటు?

పాక్‌కు ప్రాతినిధ్యం వహించే ఫార్మాట్లను పరిగణనలోకి

పాక్‌కు ప్రాతినిధ్యం వహించే ఫార్మాట్లను పరిగణనలోకి

ఇదిలా ఉంటే ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుపై పీసీబీ బోర్డు మీడియాతో “సెంట్రల్ కాంట్రాక్టు ఒప్పందాలను ఖరారు చేసే క్రమంలో 1 ఆగస్టు 2019 నుండి 2020 జూన్ 30 వరకు ఆటగాళ్ల ప్రదర్శన.. గత 12 నెలల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్ మరియు రాబోయే సీజన్‌లో వారు పాక్‌కు ప్రాతినిధ్యం వహించే ఫార్మాట్లను పరిగణనలోకి తీసుకున్నాం” అని పేర్కొంది.

సెంట్రల్ కాంట్రాక్టు జాబితా ఇదే

సెంట్రల్ కాంట్రాక్టు జాబితా ఇదే

కేటగిరీ A (PKR 1.1m): బాబర్ అజాం, సర్ఫరాజ్ అహ్మద్, యాసిర్ షా

కేటగిరీ B (PKR 750,000) : అసద్ షఫీక్, అజార్ అలీ, హరిస్ సోహైల్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ అబ్బాస్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, వహాబ్ రియాజ్

కేటగిరీ C (PKR 550,000): అబిద్ అలీ, హసన్ అలీ, ఫఖర్ జమాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, ఉస్మాన్ షిన్వారీ

గౌరవం భావిస్తున్నా: కోహ్లీతో ఫొటో దిగేందుకు వివ్ రిచర్డ్స్ ఆసక్తి

2019-20 సీజన్‌లో పాక్ జట్టు ఆడే టోర్నీ వివరాలు:

2019-20 సీజన్‌లో పాక్ జట్టు ఆడే టోర్నీ వివరాలు:

1 ఆగస్టు 2019 నుంచి 30 జూన్ 2020 వరకు:

v Sri Lanka – 2 Tests, 3 ODIs and 3 T20Is (split tour)

v Australia – 2 Tests, 3 T20Is

v Bangladesh – 2 Tests, 3 T20IsSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here