సంకల్పబలంతో అన్ని సాధ్యం అవుతాయి

0
1


సంకల్పబలంతో అన్ని సాధ్యం అవుతాయి

క్రీడాకారుడు హుసాముద్దిన్‌తో పాలనాధికారి ఎంఆర్‌ఎంరావు, ఛైర్మన్‌ విఠల్‌రావు

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే : సదుపాయాలు లేకున్నా సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎంరావు అన్నారు. నిజామాబాద్‌లో సోమవారం అంతర్జాతీయ బాక్సింగ్‌ క్రీడాకారుడు హుసాముద్దిన్‌, శిక్షకుడు సంసముద్దిన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలనాధికారి ఎంఆర్‌ఎంరావు హాజరై మాట్లాడుతూ..జిల్లాలో పరిమిత సదుపాయాలున్నా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడం గొప్పవిషయమన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. సీనియర్‌ క్రీడాకారులే శిక్షకులుగా వ్యవహరించి మంచి శిక్షణను అందిస్తున్నారని, త్వరలోనే క్రీడాకారులకు సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హుసాముద్దిన్‌ భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముఖ్య అతిథి జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు హాజరై మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి క్రీడలంటే నాకు చాలా ఇష్టమన్నారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇందులో పలు క్రీడా సంఘాల ప్రతినిధులు గడీల శ్రీరాములు, వెంకులు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here