సందేశానికి స్వస్తి

0
3


సందేశానికి స్వస్తి

మధ్యాహ్న భోజన నమోదులో అక్రమాలు ●

రోజు వారి వివరాలు పంపించని పాఠశాలలు

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి

సిరికొండ మండల విద్యా వనరుల కేంద్రం

ఈ భవనంలో సిరికొండ మండల విద్యా వనరుల కేంద్రం కొనసాగుతోంది. ఈ ఎమ్మార్సీ పరిధిలో 54 పాఠశాలలు ఉండగా ఈ నెల 21న కేవలం 22 పాఠశాలలు మాత్రమే మధ్యాహ్న భోజన సంక్షిప్త సందేశాలు పంపాయి. ఇంకా 32 బడులు పంపలేదు.

ర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది నూతన ‘సందేశం’(ఎస్‌ఎంఎస్‌) విధానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే ఈ పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. రోజు 20-30 శాతం బడులు సందేశానికి స్వస్తి పలుకుతున్నాయి. మధ్యాహ్న భోజనంలో పారదర్శకతకు ముందడుగు పడటం లేదు.

అక్రమాలకు అడ్డుకట్టేది

జిల్లాలో ప్రస్తుతం 1,196 ప్రభుత్వ పాఠశాలల్లో 1.04 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత విద్యా సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో ‘సంక్షిప్త సందేశం’(ఎస్‌ఎంఎస్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాల నుంచి మధ్యాహ్న భోజనం చేసిన వారి వివరాలను ఎస్‌ఎంఎస్‌ విధానం ద్వారా తెలుసుకుంటోంది. గతేడాది ఈ విధానం సక్రమంగా అమలైనా ఈ విద్యా సంవత్సరంలో నాలుగు నెలలు గడిచినా ఇంకా గాడిన పడలేదు. రోజు మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల సంఖ్య విధిగా పంపాలి. కానీ జిల్లాలోని అనేక పాఠశాలలు సంక్షిప్త సందేశాలు పంపించడం మర్చిపోయాయి. ముఖ్యంగా సిరికొండ, నిజామాబాద్‌ దక్షిణం, నిజామాబాద్‌ ఉత్తరం, జక్రాన్‌పల్లి, నవీపేట్‌, ఆర్మూర్‌, మెండోరా మండలాల్లో పదుల సంఖ్యలో పాఠశాలలు ఎస్‌ఎంఎస్‌ విధానానికి ముగింపు పలికాయి.

గాడి తప్పిన పర్యవేక్షణ..

ప్రతి పాఠశాలలో విద్యార్థుల నమోదు, బియ్యం నిల్వల వివరాలు, మధ్యాహ్న భోజనం చేయని విద్యార్థుల వివరాలు పారదర్శకంగా తెలుసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. కొన్ని మండలాల ఎంఈవోల పర్యవేక్షణలోపం, ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. కొన్ని ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల విద్యార్థుల నమోదు అధికంగా చూపి మధ్యాహ్న భోజనంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖ అధికారులు ఇన్‌ఛార్జీలుగా కాలం వెళ్లదీస్తున్నారు. గత ఏడాది నియమించిన పాఠశాల మధ్యాహ్న భోజన పర్యవేక్షక సంఘాలు కూడా తమ పనితీరును మర్చిపోయాయి. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు, పాఠశాలల యాజమాన్య, మధ్యాహ్న భోజన పర్యవేక్షక సంఘాలు మేల్కొవాలని విద్యార్థులు కోరుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here