సతుల స్థానంలో పతులు

0
11


సతుల స్థానంలో పతులు

న్యూస్‌టుడే, బాన్సువాడ గ్రామీణం

 
మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో సమావేశానికి హాజరైన భర్తలు

మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. మహిళా ప్రజాప్రతినిధులు సభలు, సమావేశాలకు హాజరు కావాల్సి ఉండగా భర్తలే పెత్తనం చలాయిస్తున్నారు. బాన్సువాడ మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం హరితహారంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. బుడ్మి సర్పంచి లక్ష్మి స్థానంలో ఆమె భర్త నాందేవ్‌, బుడ్మి ఎంపీటీసీ సభ్యురాలు రుక్మిణి స్థానంలో ఆమె భర్త రవి, తిర్మలాపూర్‌ ఎంపీటీసీ సునీత స్థానంలో ఆమె భర్త మల్లారెడ్డి, బోర్లం క్యాంప్‌తండా సర్పంచి నాన్కు స్థానంలో ఆమె భర్త పీర్య సమావేశంలో పాల్గొన్నారు. సంగోజీపేట్‌ సర్పంచి లక్ష్మితో పాటు భర్త శంకర్‌గౌడ్‌, జేకే తండా సర్పంచి సంగ్యానాయక్‌తో పాటు కొడుకు జగ్రాం, కొత్తబాది సర్పంచి అంకితతో పాటు భర్త సాయాగౌడ్‌ సమావేశానికి హాజరయ్యారు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here