సభాపతి సుడిగాలి పర్యటన

0
2


సభాపతి సుడిగాలి పర్యటన

బాన్సువాడలోని ఎన్జీవో కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకొంటున్న సభాపతి శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ గ్రామీణం, న్యూస్‌టుడే: బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవో కాలనీ, మదీనా, చైతన్య, శ్రీరామ కాలనీల్లో గురువారం సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. పలు చోట్ల మురుగు కాల్వలు, రోడ్లు నిర్మించాలని సభాపతి దృష్టికి తీసుకొవచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. బాన్సువాడ పంచాయతీని బల్దియాగా, రెవెన్యూ డివిజన్‌గా మార్చామని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధికి పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సీసీ రోడ్ల అభివృద్ధికి రూ. 10 కోట్లు, రోడ్డు విస్తరణకు రూ.37 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పురపాలకంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో సుమారు 800 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మరో 500 పనులు ప్రారంభమయ్యాయన్నారు. అర్హులందరికీ ఇళ్లను మంజూరు చేస్తానన్నారు. ఎన్జీవో, మదీనా కాలనీల్లో సీసీ రోడ్లు వేయిస్తానన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, సొసైటీ ఛైర్మన్‌ ఎర్వాల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, కొత్తకొండ భాస్కర్‌, ఎజాజ్‌, మోహన్‌నాయక్‌, జంగం గంగాధర్‌, వెంకట్‌రామ్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, బాబా, పాత బాలు తదితరులున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here