సభ్యత్వాలతో సంస్థాగతంగా బలోపేతం

0
1


సభ్యత్వాలతో సంస్థాగతంగా బలోపేతం

పార్టీ నాయకులతో మాట్లాడుతున్న యెండల లక్ష్మీనారాయణ

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: సభ్యత్వాల నమోదుతో భాజపా సంస్థాగతంగా బలోపేతమవుతుందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌ అధ్యక్షతన నిజామాబాద్‌ నగర సహ ప్రముఖ్‌లతో సభ్యత్వ నమోదుపై బుధవారం సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి యెండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభ్యత్వ నమోదుని ఈనెల 20 వరకు పొడిగించారని, అప్పటిలోగా మరో 20వేల సభ్యత్వాలు చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్‌రాజ్‌, జిల్లా నాయకులు భరత్‌ భూషణ్‌, గజం ఎల్లప్ప, మల్లేష్‌ యాదవ్‌, పొతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, స్వామియాదవ్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here