సమస్యలు పరిష్కరించాలి

0
2


సమస్యలు పరిష్కరించాలి

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు

మోకన్‌పల్లి(నవీపేట), న్యూస్‌టుడే: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 8న ఉమ్మడి జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్‌ పేర్కొన్నారు. మండలంలోని మోకన్‌పల్లి కస్తుర్బా పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేశారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ విజయరామరాజు, జిల్లా కార్యదర్శి భానోదయస్వామి, అనంతరాజు పాల్గొన్నారు.

అమ్దాపూర్‌(బోధన్‌ గ్రామీణం): కస్తూర్బాలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినుల సమస్యలు పరిష్కరించాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు విజయరామరాజు డిమాండు చేశారు. సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 8న జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయినులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం బోధన్‌ మండలం అమ్దాపూర్‌ కేజీబీవీలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రత్యేకాధికారి హిమబిందు, శంతన్‌, భానోదయస్వామి, అనంతరాజు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here