సమాజానికి ఆదర్శం కామారెడ్డి రక్తదాతల సమూహం

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహం ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తాన్ని అందిస్తూ వందలాది మంది ప్రాణాలను కాపాడడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతున్న సుంకరి అర్చన అనే మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో తుజాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన వెంకటేష్‌, ప్రవీణ్‌, రాజులు ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజంలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైనప్పుడు ఈ నెంబరుకు 9492874006 సంప్రదించాలని సూచించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here