సముద్రంలో మునిగిపోతామేమో అని చాలా భయపడ్డాను: ఛార్మి

0
3


ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బొద్దుగుమ్మ ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారిపోయారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’తో విజయాన్ని అందుకున్న ఛార్మి.. ఆ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆనందంలో ‘ఇస్మార్ట్ శంకర్’పై రోజుకో ట్వీట్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. అయితే, మంగళవారం ఛార్మి చేసిన ట్వీట్ ఒకటి చాలా ఆసక్తికరంగా ఉంది. మాల్దీవుల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎదురైన సంఘటన గురించి ఛార్మి ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘ఉండిపో’ అనే రొమాంటిక్ సాంగ్‌ను మాల్దీవులులో చిత్రీకరించారు. ఈ పాటలోని కొన్ని ఎక్స్‌క్లూజివ్ షాట్స్‌ను ఒక ఇసుక దీవిలో షూట్ చేశారట. ఈ ఇసుక దీవికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి రోజూ కొన్ని గంటలపాటు మాత్రమే ఈ ఇసుక దీవి కనిపిస్తుంది. ఆ తరవాత మళ్లీ సముద్రం ముందుకొచ్చి ఈ దీవి మునిగిపోతుంది. ఆ కొన్ని గంటల వ్యవధిలోనే పాటకు సంబంధించిన షాట్స్‌ను చిత్రీకరించారట. అయితే, షూటింగ్ అయిపోయిన తరవాత యూనిట్ మొత్తం ఫెర్రీ ఎక్కుతున్న వీడియోను ఛార్మి ట్వీట్ చేశారు. సముద్రంలో మునిగిపోతామేమోనని తను చాలా భయమేసిందని ఛార్మి ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఛార్మి పోస్ట్ చేసిన వీడియోలోనే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నీలిరంగులో సముద్రం చాలా బాగుంది. ఇలాంటి ప్రాంతాన్ని రియల్‌గా చూస్తే ఇంకెంత అనుభూతి కలుగుతుందో. కాగా, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబడుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here