‘సరిలేరు నీకెవ్వరు’.. మహేష్ రుణం తీర్చుకుంటున్న బండ్ల గణేశ్!

0
2


హాస్యనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరవాత నిర్మాతగా మారారు బండ్ల గణేశ్. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన బండ్ల.. నటనకు టాటా చెప్పి చాలా కాలం అయ్యింది. చివరిగా పూరి-మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్‌మేన్’ సినిమాలో గణేశ్ కనిపించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో బాగా సంపాదించిన ఈ మాజీ నటుడు ఆ డబ్బును సినిమాల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించారు. అయితే, చాలా ఏళ్ల తరవాత గణేశ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు.

మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బండ్ల గణేశ్ ఒక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర చాలా సరదాగా ఉండబోతోందట. మంగళవారం బండ్ల గణేశ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. వాస్తవానికి నిర్మాతగా మారిన గణేశ్‌కు సినిమాల్లో నటించాల్సిన అవసరంలేదు. కానీ, కేవలం మహేష్‌బాబు రుణం తీర్చుకోవడానికే ఈ సినిమాలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

Also Read: ‘పింక్’ రీమేక్.. బాలయ్య తప్ప మరొకరితో కుదరదంటోన్న దిల్ రాజు!

ఇప్పటికే గణేశ్‌కు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయట. కానీ, గణేశ్ ఆసక్తి చూపలేదు. అయితే, మహేష్‌బాబు కోసమే ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నారని గణేశ్ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేశ్ ‘బాద్‌షా’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు మహేష్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అప్పట్లో గణేశ్ వెళ్లి అడిగిన వెంటనే మహేష్ అంగీకరించారు. ఇప్పుడు మహేష్ రుణాన్ని తీర్చుకునే అవకాశం గణేశ్‌కు వచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి వెళ్లి అడగ్గానే బండ్ల ఓకే చెప్పేశారట. కేవలం మహేష్‌బాబు కోసమే గణేశ్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నటించడానికి గణేశ్ పారితోషికం కూడా భారీగానే తీసుకుంటున్నారని టాక్. ఒక్కరోజుకు ఆయన రూ.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ.. బండ్ల గణేశ్‌కు అంత మొత్తంలో ఎందుకిస్తారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత అయితే అయ్యుండొచ్చు కానీ.. నటుడిగా ఆయనకు ఈ మధ్య గొప్ప సినిమాలు ఎక్కడున్నాయని అంటున్నారు. నిజమే కదా! మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాల్సి ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here