సాఫ్ట్‌వేర్ సుధీర్ : మొత్తం కామెడీనే

0
2


ఢీ షో లో అస్తమాను హీరో అంటూ ఒక మేనరిజం పెట్టుకుని అందరిని అలరించిన, అలరిస్తున్న సుధీర్ ఇప్పుడు హీరోగా మారాడు. అక్కడ సుధీర్ హీరో అవుతా అనగానే సెటైర్స్ పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే హీరో అయిపోయాడు. అతను నటించిన సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎక్స్ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌గా నవ్విస్తున్న అతను ఇప్పుడు ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’‌గా మారాడు. ఆ‌ టీజర్‌లో ముందు ఎదో యాక్షన్ హీరోలా రెండు మూడు బిల్డప్ షాట్స్ ఇచ్చిన సుధీర్ ఆ తరువాత మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ చెయ్యడానికి ప్రయత్నించాడు.అతని ఒరిజినల్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో కూడా బాగా పండినట్టు అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ చెప్పటప్పుడు ఈజ్ కూడా బావుంది.

Also Read: ‘సైరా’ ఫస్ట్ రివ్యూ: ఇతని రేటింగ్‌ని నమ్మలేం

చాలామంది బుల్లితెర నటులు కూడా హీరోలుగా వచ్చినా కూడా క్లిక్ కాలేదు. కానీ సుధీర్ మాత్రం వాళ్ళకి భిన్నంగా వెళుతున్నట్టు కనిపిస్తున్నాడు. పేరుకి ఒక పేరడీ సినిమా టైటిల్‌లా ఉన్నా కూడా ఈ సినిమాలో ఎదో చెప్పుకోదగ్గ మ్యాటర్ కూడా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో షియాజీ షిండే, నాజర్, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి లాంటి చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. అయితే మరొక విశేషం ఏంటంటే ప్రజాగాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గద్దర్ ఈ సినిమాలో ఒక పాట పాడాడు, సినిమాలో ఆ పాటలో ఆయనే నటించాడు కూడా. ఇక టెక్నీషియన్స్ లిస్ట్‌లో కూడా పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద సినిమాలకు DOP గా పనిచేసిన సి.రామ్ ప్రసాద్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. అలాగే గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.

Also Read: మాస్‌రాజా మళ్ళీ బలుపు చూపిస్తాడా?

ఈ సినిమాలో సుధీర్‌కి జోడిగా ధన్య బాలకృష్ణ నటిస్తుంది. ఈ టీజర్‌కి ప్రేక్షకులనుండి స్పందన కూడా బావుంది. అయితే సుధీర్‌కి జోడీగా రష్మీ అయితే బావుండేది అని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పై శేఖర రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్. అయితే ఈ సినిమాని అంత తేలిగ్గా తీసిపడెయ్యడానికి లేదు. ఇంతమంది పెద్ద వాళ్ళు ఈ సినిమాకి పనిచేస్తున్నారు అంటేనే సినిమాలో ఎదో ఒక బలమయిన ఎలిమెంట్ ఉండి ఉంటుంది. కానీ టీజర్ కాబట్టి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ కేవలం కామెడీ ఉండేలా శాంపిల్ చూపించారు. ట్రైలర్ రీలీజ్ అయితేగానీ ఈ సినిమాలో ఏముంది అనేది పూర్తిగా తెలియదు.

Also Read: స్నేహారెడ్డి బర్త్‌డే.. భార్యకు బన్నీ స్వీట్ విషెస్Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here