సాయంత్రం నుంచే ఐఫోన్ 11 విక్రయాలు: ఏ ఫోన్ ధర ఎంతంటే?

0
4


సాయంత్రం నుంచే ఐఫోన్ 11 విక్రయాలు: ఏ ఫోన్ ధర ఎంతంటే?

ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లను ఇటీవలే ఆపిల్ ఆవిష్కరించింది. తాజాగా భారత మార్కెట్లో ఈ ఫోన్ల సేల్స్ ఈరోజు (సెప్టెంబర్ 27వ తేదీ) నుంచి ప్రారంభం అవుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి ఐఫోన్ 11 సిరీస్ ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ లాంటి ఆన్ లైన్ స్టోర్స్‌తో పాటు యాపిల్ అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆన్ లైన్ రిటైలర్ల్స్ నుంచి ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

వైట్, బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో, పర్బుల్ .. ఇలా ఆరు కలర్స్‌లలో ఐఫోన్ 11 అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మిడ్ నైట్ గ్రీన్, స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్ కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 64GB వేరియంట్ ధర రూ.64,900, 128GB వేరియంట్ ధర 69,900, 256GB వేరియంట్ ధర 79,900గా ఉంది. ఐఫోన్ 11 ప్రో ధర రూ.99,900, ఐఫోన్ 11 ప్రోమాక్స్ ధర రూ.1,09,900గా ఉంది.

ఐఫోన్లను టిమ్ కుక్ పదిహేను రోజుల క్రితం లాంచ్ చేశారు. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించారు. తాజాగా, భారత్‌లో ఈ ఫోన్స్ ధరలను ఆపిల్ ప్రకటించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here