సారా కఠిన నిర్ణయం: మొన్న నగ్న చిత్రం, నేడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

0
3


హైదరాబాద్: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ సారా టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సారా టేలర్ ఇంగ్లాండ్ తరుపున 226 వన్డేలాడి 6,533 పరుగులు చేశారు. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆమె రిటైర్మెంట్‌పై అధికారిక ప్రకటన చేసింది.

తన రిటైర్మెంట్‌పై సారా టేలర్ మాట్లాడుతూ “ఇది చాలా కఠిన నిర్ణయం. అయినా నాకు తెలుసు నా ఆరోగ్య దృష్ట్యా వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం. గత, ప్రస్తుత నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన సహచరులు, స్నేహితులతో పాటు ఈసీబీకి నేను కృతజ్ఞతలు చెప్పలేను” అని అన్నారు.

“ఇంగ్లాండ్‌కు ఆడటం, ఇంగ్లాండ్ జెర్సీ ధరించడంతో నా కల నిజమైంది. నా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్షణాలను సొంతం చేసుకున్నాను. 2006లో నా అరంగేట్ర యాషెస్ సిరిస్, లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో వరల్డ్‌కప్ ఇలాంటివి కొన్ని. ఈ క్రమంలో నేను ప్రపంచం మొత్తం తిరిగాను. ఎంతో మందిని స్నేహితులుగా పొందాను” అని సారా టేలర్ అన్నారు.

చాలా మంది యువకులకు ప్రేరణగా

చాలా మంది యువకులకు ప్రేరణగా

“ఇంగ్లాండ్ గర్ల్స్ అటు మైదానం బయట లోపాలా రోల్స్ మోడల్స్‌గా ఉంటారు. క్రికెట్ గేమ్‌ ద్వారా చాలా మంది యువకులు ప్రేరణ పొంది దీనిని చేపట్టడానికి ప్రేరేపిస్తుంది. నా కెరీర్ గురించి నేను చాలా గర్వపడుతున్నాను. నేను నా తలని ఎత్తుకొని, నా భవిష్యత్తు ఏమిటో, నా తదుపరి అధ్యాయం ఏమి తెస్తుందో ఉత్సాహంతో వైదొలగుతున్నా” అని సారా టేలర్ చెప్పారు.

ట్రిపుల్ వరల్డ్ ఛాంపియన్

“ట్రిపుల్ వరల్డ్ ఛాంపియన్ సారా టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆమె అద్భుతమైన కెరీర్‌కు శుభాకాంక్షలు” అంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సైతం ట్వీట్ చేసింది. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సారా టేలర్… ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటోంది.

క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వెనుక

క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వెనుక

వాటి కారణంగానే ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. గత కొంతకాలంగా ఆందోళన సమస్యతో బాధఫడుతున్న సారా టేలర్ ఇటీవలే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరిస్‌కు సైతం దూరమైంది. కొన్ని రోజుల క్రితం తన నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు.

వివరణ ఇచ్చిన సారా టేలర్

మె తన కంఫర్ట్ జోన్‌ను దాటుకుని మరీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఆమె ఎవరూ చేయని సాహసం చేసింది. ఈ మంచి పనికి తనను ఆహ్వానించిన ఉమెన్స్ హెల్త్ యుకే ఆర్గనైజేషన్‌కు సారా ధన్యవాదాలు తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here