సారీ పాకిస్థాన్.. ‘కశ్మీర్’లో జోక్యం చేసుకోలేం.. తేల్చేసిన ఐరాస

0
6


భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో పాకిస్థాన్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మనతో దౌత్య సంబంధాలను తగ్గించుకున్న పాక్.. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల రద్దుకు నిర్ణయించింది. భారత్‌పై బ్లాక్‌మెయిలింగ్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. కశ్మీర్లో ఏదేదో జరిగిపోతోదంటూ.. భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఐక్యరాజ్య సమితి మెట్లెక్కింది. ప్రపంచ దేశాలన్నీ పెద్దగా పట్టించుకోకున్నా.. భారత్‌పై ఎలాగైనా ఒత్తిడి పెంచాలనేది పాకిస్థాన్ వ్యూహం.

ఐక్యరాజ్య సమితిలోనూ పాకిస్థాన్‌కు చుక్కెదురైంది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టెర్స్ మాట్లాడుతూ.. 1972 నాటి సిమ్లా ఒప్పందం ప్రకారం.. కశ్మీర్ సమస్యను ఇరు దేశాలూ పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది. సంయమనం పాటించాలని ఇరు దేశాలకూ సూచించింది.

సిమ్లా ఒప్పందం ప్రకారం జమ్మూ కశ్మీర్ సమస్యను ఐరాస చార్టర్ ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. జమ్మూ కశ్మీర్లోని తాజా నియంత్రణలు ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనకు దారి తీయొచ్చని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

అసలు విషయం ఏంటంటే.. పాకిస్థాన్ ఐరాసను ఆశ్రయిస్తుందనే సంగతి ముందే తెలిసిన భారత్ ఆర్టికల్ 370 రద్దు తదితర పరిణమాలను భద్రతామండలిలోని ఐదు శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలకు ఎప్పటికప్పుడు వివరిస్తోంది. భద్రతామండలిలో సభ్యదేశాలు కశ్మీర్ అంశంలో తనకు సపోర్ట్ నిలవడం కోసం భారత్ ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 37ఏ లను పాకిస్థాన్ ఎప్పుడూ గుర్తించలేదని ఆ దేశ ఆర్మీ చేసిన వ్యాఖ్యలను భారత్ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here