‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్.. ఈ ఏడాదికే అతిపెద్ద వేడుక..!

0
1


రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ‘సాహో’ సందడి మొదలైపోయింది. చాలా రోజుల తరవాత ప్రభాస్‌ను నేరుగా చూసే అవకాశం వేలాది మంది అభిమానులకు కలగనుంది. ‘బాహుబలి’ సినిమా తరవాత ‘సాహో’ షూటింగ్‌తో బిజీ అయిపోయిన ప్రభాస్.. ఇప్పుడు ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తరవాత హిందీలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి మీడియాకు, జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే, సినిమా విడుదలకు ముందు ఎంతో ఘనంగా నిర్వహించే ప్రధానమైన ప్రీ రిలీజ్ వేడుకతో ప్రభాస్ అభిమానుల ముందుకు వస్తున్నారు.

Also Read: ‘పాగల్’ అయిపోతున్న ‘ఫలక్‌నుమా దాస్’!

ఈనెల 18న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను కూడా నాలుగు భాషల్లో షేర్ చేసింది. ‘‘2019 బిగ్గెస్ట్ నైట్‌కి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 18న సాయంత్రం 5 గంటల నుంచి సాహో ప్రీ రిలీజ్ వేడుకతో ‘సాహో’ను సెలబ్రేట్ చేసుకుందాం’’ అని యూవీ క్రియేషన్స్ ట్వీట్‌లో పేర్కొంది.

కాగా, ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘రన్ రాజా రన్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేకర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా తదితరులు ‘సాహో’ చిత్రంలో నటించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here