సింగిల్ ఛార్జింగ్ Samsung Galaxy M30s ఫోన్‌తో 3700 కి.మీ జర్నీ చేసిన అర్జున్ వాజ్‌పేయ్

0
5


సూర్యోదయాన్ని చూసేందుకు చాలామంది ఉదయాన్నే నిద్రలేస్తారు. కానీ ప్రొఫెషనల్ పర్వతారోహకుడు అర్జున్ వాజ్‌పేయ్ మాత్రం రాత్రంతా నిద్రలేకుండా సూర్యోదయం కోసం వేచిచూశాడు.

కేవలం ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన మొబైల్ ఫోన్‌తో #GoMonster సవాల్‌ను పూర్తిచేసేందుకు దట్టమైన అడవుల్లో నడుస్తూ.. నదులు, వంతెనలు దాటుకుంటూ, పర్వతాలను అధిరోహిస్తూ అర్జున్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2010లో అర్జున్ 16 ఏళ్ళ వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించారు. అంతేగాక 8000 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరాలను 6 సార్లు అధిరోహించారు. అంత చరిత్ర గల అర్జున్, 6000mAh అసాధారణ బ్యాటరీ కలిగిన Samsung Galaxy M30s ఫోన్‌ను ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసుకుని సరికొత్త సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు. గతంలో అనేక సాహస యాత్రలు, సవాళ్ళ పరంగా ఊహించని విజయాలను అందుకున్న అర్జున్ సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో దేశమంతా ఈ సవాల్‌ను అతడు ఎలా ఎదుర్కొంటాడని ఆసక్తితో ఎదురుచూస్తోంది.

అమిత్ సాధ్‌లా అర్జున్ విజయం సాధించగలడా?
ఇటీవల ప్రముఖ నటుడు అమిత్ సాధ్ ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన Samsung Galaxy M30s ఫోన్‌తో రెండు రోజులు లేహ్ నుంచి హాన్లేకు ప్రయాణాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అర్జున్ వాజ్‌పేయ్‌ను తూర్పు భారతదేశం నుంచి పశ్చిమానికి ప్రయాణించాలని సవాలు విసిరారు. దీని ప్రకారం అర్జున్ అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యోదయాన్ని చూసి.. గుజరాత్ తీరంలో సూర్యాస్తమయాన్ని చూడాలి. ఇందుకు అతడు 3700 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది కూడా ఒకసారి మాత్రమే ఛార్జింగ్ చేసిన ఫోన్‌తో ఈ ఛాలెంజ్‌ను అర్జున్ ధైర్యంగా అంగీకరించాడు.


ఈ సవాల్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ లోయ నుంచి గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి అర్జున్ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ జర్నీలో అర్జున్ సొంత వాహనాలను ఉపయోగించకూడదు. కేవలం ప్రజా రవాణ వ్యవస్థను మాత్రమే ఉపయోగించాలి. గతంలో ఎన స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి Samsung Galaxy M30s ఈ ప్రయాణం ద్వారా ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాము. సెప్టెంబర్ 18, 2019న అందుబాటులోకి రానున్న ఈ హ్యాండ్‌సెట్.. మార్కెట్లోనే అత్యంత సామర్థ్యం గల బ్యాటరీ ఫోన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారతదేశంలోని తూర్పు దిక్కున గల డాంగ్ వ్యాలీలో సూర్యోదయం ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంది. అక్కడ 97% ఛార్జ్ చేసిన బ్యాటరీ గల మొబైల్ ఫోన్‌తో అర్జున్ సూర్యోదయాన్ని చూసి ప్రయాణం ప్రారంభిస్తారు.


హైపర్ లాప్స్ వీడియోలు చూసేందుకు సరదాగా ఉంటాయి, అయితే వాటిని షూట్ చేయడం చాలా కష్టం. అయితే, Samsung Galaxy M30s, 48MP ట్రిపుల్ రేర్ కెమెరా సూపర్ జూమ్, మల్టీ-యాక్సిస్ క్లిప్‌లతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేలా రూపొందించబడింది. డాంగ్ వాలీ.. సముద్ర మట్టానికి 1240 మీటర్ల ఎత్తులో ఉంది. లోహిత్, సతీ నదుల సంగమం వద్ద ఉన్న డ్యాంగ్ వ్యాలీ.. దేశంలోనే తొలి సూర్యోదయం ఏర్పడే ప్రాంతం.

మొదటి రోజు : డాంగ్ వ్యాలీ నుంచి పశ్చిమ దిక్కుకు అర్జున్ ప్రయాణం మొదలైంది. ఎలాంటి వాహనాలు వాడకుండా అర్జున్ కాలినడకన లోయలు, వంతెనులు, నదులు దాటుతూ… అస్సాంలోని డిబ్రుగడ్‌ విమానాశ్రయానికి చేరుకోవల్సి ఉంది. దాదాపు 10 గంటలు పట్టే ప్రయాణాన్ని పూర్తిచేయడానికి, అర్జున్ కొంతమంది స్థానికులతో కలిసి ప్రయాణించాల్సి వచ్చింది. మరి, అప్పటి వరకు మీ ఫోన్ బ్యాటరీ నిలుస్తుందా? ఒకసారి ఆలోచించండి.

గోల్డెన్ పగోడా ఎదురుగానున్న నోయి-చైనామ్ వద్ద స్థాపించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద వెదురు బుద్ధ విగ్రహం అయిన లుభాముని వద్ద అర్జున్ కాస్త విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ కాసేపు అక్కడ సరదాగా సెల్ఫీలు తీసుకుంటూ గడిపారు.


అయితే, అప్పటికి అర్జున్ కేవలం 260 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాడు. ఇంకా 3400 కిమీల దూరం ప్రయాణించడానికి అతడు ఫోన్ బ్యాటరీని సేవ్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని భావించాడు. తర్వాతి రోజు ఉదయం, అతను డీబ్రూగడ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు స్థానిక క్యాబ్‌ సర్వీసులను పొందలేక ఇబ్బందిపడ్డాడు. దీంతో అర్జున్ విమానాశ్రయానికి వెళ్లేందుకు చిన్న బస్సు కోసం వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం అతని ఫోన్‌లో 80% బ్యాటరీ మాత్రమే ఉంది. అప్పటి ఇంకా ఈశాన్య రాష్ట్రంలోనే ఉన్నారు. పైగా అర్జున్ ఫ్లైట్ తప్పిపోయే అవకాశం కూడా ఉంది.


రెండవ రోజు : ఈ సమయానికి, అర్జున్ మరింత తొందరగా లక్ష్యానికి చేరుకోవాలని కోరుకున్నాం. ఒక వైపు సమయం వేగంగా నడుస్తోంది. మరోవైపు బ్యాటరీ తగ్గిపోతోంది. అర్జున్ చివరికి పర్వతాలను చాకచక్కంగా అధిరోహించి డిబ్రూగడ్ నుంచి కోల్‌కతా మీదుగా అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాన్ని అందుకోగలిగారు.


విమానం ఆలస్యంగా గమ్యానికి చేరుకుంది. దీంతో అర్జున్ తన వద్ద సమయానికి అనుకూలంగా ప్లాన్ చేసుకున్నారు. అరేబియా సముద్రంలో సూర్యాస్తమయానికి చూడటానికి అర్జున్ ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అయితే, అతని విమానం గాల్లో ఉన్నప్పుడే ఫోన్ బ్యాటరీ 30% చేరుకుంది. ఈ Samsung Galaxy M30s యొక్క Infinity-U డిస్ప్లేకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ పరికరంలోని స్క్రీన్ Edge to Edge డిస్ప్లే పనితనం అద్భుతంగా ఉంటుంది. ఇది అర్జున్‌కు అసాధారణ వాస్తవిక వీక్షణా అనుభవాన్ని అందించింది. క్రమంగా, ఇది అతని ప్రయాణాన్ని కొంచెం సులభతరం చేసింది. అలాగే, sAMOLED డిస్ప్లేతో ఉన్న ఈ Samsung Galaxy M30s తక్కువ శక్తిని వినియోగిస్తూ, అధిక కాంట్రాస్ట్ రేషియోని ఇస్తూ, త్వరగా మారుతున్న వెలుతురుకు అనుగుణంగా డిస్ప్లే ప్రదర్శిస్తూ అద్భుతమైన పనితీరుని కనబరచింది. అంతేకాకుండా, రైలులో అవసరమైన మోతాదులో తక్కువ డిస్ప్లేని అందించింది. క్రమంగా బ్యాటరీ కొంతవరకు ఆదా అయ్యింది.

30 శాతం కూడా లేని బ్యాటరీతో సాగుతున్న అతని యాత్ర సాగుతోంది. మరి, రైలు ప్రయాణంలో ఆ బ్యాటరీ నిలిచిపోయిందా? తెలుసుకుందాం:


ఒక్కసారి ఊహించుకోండి, అది ఎంత వరకు సాధ్యమవుతుంది? సముద్ర మట్టానికి 1240 మీటర్ల ఎత్తుగల ప్రాంతం నుంచి 110 మీటర్ల వరకు అపసవ్యదిశలో ప్రయాణం. అర్జున్ మూడు రోజుల #GoMonster ఛాలెంజ్.. విజయానికి అతి దగ్గరలో ఉంది. చివరి సూర్యాస్తమయాన్ని అందుకోవడానికి అతను ఇంకా ఒక రహదారిలో ప్రయాణించాల్సి ఉంది. మొత్తానికి అతను ఆ ప్రయాణాన్ని కూడా పూర్తిచేసి.. చాగ్డా (స్థానిక రిక్షా) సహాయంతో అక్కడికి బయల్దేరారు. ఒక వైపు ఆకాశం, మరోవైపు స్మార్ట్ ఫోన్ బ్యాటరీ.. రెండూ ఎరుపు రంగులోకి మారుతున్న దశలో, దేశంలోని చివరి సూర్యాస్తమయాన్ని చూసేందుకు అర్జున్ అరేబియా సముద్రం వద్దకు చేరారు.


అటువంటి అసాధారణమైన అనుభూతిని పొందినప్పుడు ఎవరికైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అనుభూతి కలుగుతుంది. అయితే, ఆ అనుభూతి అర్జున్ ఇదివరకే చూశాడు. ఈ #GoMonster చేజ్‌ను పరిశీలిస్తున్న మేము నిశ్చేష్టులమైపోయాము. ఈ జర్నీలో బ్యాటరీ మాత్రమే సహాయం చేసింది అనడానికి లేదు. ఆక్టా-కోర్ Exynos ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్‌లో అధిక సంఖ్యలో పనులను నిర్వహించడానికి ఎంతగానో తోడ్పాటు అందించింది.


నిజాయితీగా చెప్పాలంటే, Samsung Galaxy M30s ఏంతో అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అంతేకాకుండా అనేక విషయాలను కూడా నేర్పింది. స్మార్ట్‌ఫోన్‌లు కేవలం కమ్యూనికేషన్ సాధనాలుగా మాత్రమే ఉండవు. అవి మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉండే సహాయకులుగా ప్రవర్తిస్తాయి. క్రమంగా మనం ఎంచుకునే స్మార్ట్ ఫోన్ ఒక వైవిధ్యభరితమైనదిగా ఉండేలా చూసుకోవడం కూడా మన బాద్యత అవుతుంది. అంతేకాకుండా వినియోగదారులు, వారి ప్రయత్నాలను నిర్విఘ్నంగా కొనసాగించడానికి, వారి గ్యాడ్జెట్లు కూడా సమానంగా బహుముఖంగా సహాయపడేలా ఉండాలి.

ఈ వ్యక్తిత్వ లక్షణాలను, అవసరాలను అర్థం చేసుకుని, Samsung సిరీస్, దాని గేమ్-ఛేంజర్ హ్యాండ్‌సెట్ Samsung Galaxy M30s ను, M సిరీస్‌కు కొనసాగింపుగా అందుబాటులోకి తెచ్చింది. 6,000 mAh బ్యాటరీ, AI-ఆధారిత ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో ఈ వారంలో భారత్‌లోకి అడుగుపెట్టనున్న ఈ Samsung Galaxy M30s రూ.15 వేల ధర నుంచి రూ .20,000 మధ్యలో ఉండనుంది. ఈ Monster మొబైల్ ను మీరు Amazon లేదా samsung.com లో కొనుగోలు చేయవచ్చు.

గమనిక : ఈ కథనాన్ని Samsung తరపున టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్‌లైట్ బృందం రూపొందించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here