సికింద్రాబాద్‌ -నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

0
2


సికింద్రాబాద్‌ -నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

నాందేడ్‌, న్యూస్‌టుడే: దసరా, దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌, సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు పీఆర్వో గురువారం ప్రకటనలో తెలిపారు. 07604 అనే నంబరు గల ప్రత్యేక రైలు అక్టోబరు రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి నిజామాబాద్‌, నాందేడ్‌, ఔరంగాబాద్‌ మీదుగా నాగర్‌ సోల్‌కు చేరుకొంటుందన్నారు. 07603 అనే నంబరు గల ప్రత్యేక రైలు అక్టోబరు 6న నాగర్‌ సోల్‌ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలు దేరి అదే మార్గంలో సికింద్రాబాద్‌కు ఉదయం 4.45 గంటలకు చేరుకొంటుందని పేర్కొన్నారు.

వంద అడుగుల జాతీయ జెండా

నాందేడ్‌: రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో శ్రీహుజుర్‌ సాహెబ్‌ నాందేడ్‌ రైల్వే స్టేషన్‌ ఎదుట వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. గురువారం ఉదయం జాతీయ జెండాను రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం ఎదుట ఏర్పాటు చేశారు. రైల్వే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. నాందేడ్‌ రైల్వే డివిజన్‌ కార్యాలయాల్లోనే అతిపెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసినట్లు డీఆర్‌ఎం త్రికాలాజ్ఞ రబా తెలిపారు.

చవాన్‌ను సన్మానిస్తున్న పార్టీ పదాధికారులు

మాజీ సీఎంకు సన్మానం

నాందేడ్‌: దక్షిణ నాందేడ్‌ కాంగ్రెస్‌ కమిటీ పదాధికారుల సమావేశంలో గురువారం మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదాధికారులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సావంత్‌, మాజీ మేయర్‌ అబ్దుల్‌ సత్తార్‌, తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

నాందేడ్‌: గాడిపురలోని అతిప్రాచీన బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు గురువారం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మందిరం మహంత్‌ స్వామి సచ్చిదానంద మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిత్యం ఉదయం 8 గంటలకు రామాయణ పారాయణం, కీర్తనలు శ్రీకృష్ణ లీలా, సేవా మోహిని, అలంకార్‌, పల్లకీ సేవ, సహస్త్ర కలశాభిషేకం, సాయంత్రం రథోత్సవం, తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here