‘సిడెల్‌ బౌలింగ్‌ చూస్తుంటే మెక్‌గ్రాత్‌ గుర్తుకు వస్తున్నాడు’

0
2


లండన్‌: యాషెస్ టెస్ట్‌లో మంచి ప్రదర్శన చేసిన పేసర్ పీటర్ సిడిల్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసించాడు. అంతేకాదు పీటర్ సిడిల్‌ను మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌తో పోల్చాడు. సిడిల్‌ బౌలింగ్ శైలి మెక్‌గ్రాత్ బౌలింగ్‌ శైలికి దగ్గరగా ఉంటుందని పాంటింగ్ పేర్కొన్నాడు. మొదటి యాషెస్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

భారత్‌ vs వెస్టిండీస్‌.. తొలి వన్డేకి వర్షం ముప్పు

తాజాగా ఆసీస్ అసిస్టెంట్‌ కోచ్‌ పాంటింగ్ మాట్లాడుతూ… ‘మెక్‌గ్రాత్‌కు లార్డ్స్‌ మైదానంలో గొప్ప రికార్డ్ ఉంది. లార్డ్స్‌లో బౌలింగ్‌ చేయడాన్ని మెక్‌గ్రాత్‌ ఎక్కువ ఇష్టపడేవాడు. మెక్‌గ్రాత్‌ గొప్ప స్వింగ్‌ బౌలర్‌ కాదు. కానీ.. సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తాడు. ప్రస్తుతం సిడెల్‌ కూడా అదే తరహాలో బౌలింగ్‌ చేస్తున్నాడు. సిడెల్‌ను చూస్తుంటే మెక్‌గ్రాత్‌ గుర్తుకు వస్తున్నాడు’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. రెండవ యాషెస్ టెస్టులో కూడా సిడిల్ తన స్థానాన్ని నిలుపుకోగలడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

హజల్‌వుడ్‌ను పక్కకు పెట్టి సిడెల్‌ను తొలి టెస్టులో ఆసీస్ యాజమాన్యం ఆడించింది. దీనిపై ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్పందించాడు. ‘బర్మింగ్‌హామ్‌ వికెట్‌ ఫ్లాట్‌గా ఉంటుంది. ఇది సిడెల్‌కు సరిగ్గా సరిపోతుందని భావించాం. అందుకే తుది జట్టులోకి ఎంపిక చేశాం’ అని లాంగర్‌ పేర్కొన్నాడు. మొదటి టెస్ట్‌లో సిడెల్‌ రెండు వికెట్లు మాత్రమే తీసాడు. ఆగష్టు 14 నుండి లార్డ్స్‌ మైదానంలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!

ఆస్ట్రేలియా నిర్దేశించిన 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో స్పిన్నర్ నాథన్‌ లైయాన్‌ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లాండ్ పతనాన్ని శాషించాడు. ప్యాట్ కమ్మిన్స్ నాలుగు వికెట్లు తీసాడు. ఇంగ్లాండ్ జట్టులో క్రిస్ వోక్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసాడు. మొదటి ఇన్నింగ్స్‌లో (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), రెండో ఇన్నింగ్స్‌లో (142; 207 బంతుల్లో 14×4) పరుగులు చేసాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here