సిలబస్‌ విధానంపై అవగాహన

0
4


సిలబస్‌ విధానంపై అవగాహన

సిలబస్‌పై చర్చిస్తున్న అధ్యాపకులు

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: యూజీసీ ఆదేశాల మేరకు సీబీసీఎస్‌ పద్ధతిలో ఆంగ్ల భాష సిలబస్‌ రూపకల్పనపై తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలో గురువారం అనుబంధ కళాశాలల అధ్యాపకులకు అవగాహన కల్పించారు. కళల పీఠాధిపతి కనకయ్య, ఆంగ్ల విభాగం అధ్యక్షురాలు సమత, బీవోఎస్‌ రమణాచారి, ప్రిన్సిపల్‌ ఆరతి సీబీసీఎస్‌ నమూనా పద్ధతి రూపొందించారు. యూజీసీ నిర్దేశించిన ప్రకారం ఉన్నత విద్యా మండలి సబ్జెక్టుల్లో సీబీసీఎస్‌ పద్ధతిని అనుసరించాలని తెలిపారు. గతేడాది పాఠ్య ప్రణాళికపై చర్చించి అధ్యాపకుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. డిగ్రీ పాఠ్య ప్రణాళికలోని మొదటి, రెండో సెమిస్టర్లలోని పాఠ్యాంశాలను ఒక్కొక్కటిగా చదివారు. ఆంగ్లం మీద విద్యార్థులకు మక్కువ పెంచేలా సిలబస్‌ రూపకల్పన చేసినట్లు వివరించారు.

 

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here