సివిల్‌ రైట్స్‌ దినోత్సవంపై అవగాహన సదస్సు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండల కేంద్రంలోని నెహ్రూ నగర్‌ కాలనీలో సోమవారం ఉదయం ‘సివిల్‌ రైట్స్‌” అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీహరి, తహశీల్దార్‌ నీలకంఠం మాట్లాడుతూ సమాజంలో ఎస్‌సి, ఎస్‌టి కులాలను చిన్న తరగతి కులంగా భావించ కుండా అందరితో సమానంగా స్వేచ్ఛ, హక్కులతో ఉండాలని అన్నారు. అందరితో సమానంగా ”సివిల్‌ రైట్స్‌” ఉండాలని అన్నారు. అదేవిధంగా ఎస్‌సి, ఎస్‌టి లు కూడా అందరి లాగా అధికారుల దగ్గరకు స్వయంగా వెళ్లి తమ తమ పనులను చేసుకోవాలని, ఎవరితో కూడా మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలుంటే స్వయంగా అధికారుల దగ్గరకు వచ్చి సమస్యలు చెపితే సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి బూస సునీత, ఉపసర్పంచి షేక్‌ వాహబ్‌, రైతు సమన్వయ సమితి బాల్కొండ మండల కో ఆర్డినేటర్‌ పుప్పాల విద్యా సాగర్‌, ఎంపిటిసి కన్న లింగవ్వ -పోశెట్టి, విఆర్వో నాగరాజు, వార్డు సభ్యులు పుప్పాల లావణ్య – సాగర్‌, గాండ్ల రాజేష్‌, గాండ్ల రాజేందర్‌, శివ ప్రసాద్‌, సయ్యద్‌ రియాజ్‌ అలీ, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు, ఎస్‌సి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here