సీఎం జగన్ కు పీపీఏ షాక్: పోలవరం గుత్తేదారు పనితీరు బాగుంది..రివర్స్ టెండరింగ్ సరికాదు..!!

0
1


సీఎం జగన్ కు పీపీఏ షాక్: పోలవరం గుత్తేదారు పనితీరు బాగుంది..రివర్స్ టెండరింగ్ సరికాదు..!!

ముఖ్యమంత్రి జగన్ కు పోలవరం ప్రాజెక్టు అధారిటీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న నవయుగ సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై పీపీఏ సుదీర్ఘంగా చర్చించింది. ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాల పైన పునరాలోచన చేయాలని సూచించింది. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని.. నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశముందని సమావేశం అభిప్రాయ పడింది. అయిదు గంటల పాటు చర్చించిన పీపీఏ ప్రస్తుత పరిస్థితులను కేంద్రానికి నివేదించనుంది. అయితే, ఏపీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే ముందు తమ సూచనలను పరిగణ లోకి తీసుకోవాలని కమిటీ సూచన చేసింది.

జగన్ నిర్ణయం రివర్స్…

పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ పైన ఆలోచన చేస్తున్న జగన్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అధారిటీ మద్దతు లభించలేదు. పోలవరం ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న గుత్తేదారు నవయుగ ను తప్పుకోవాలని కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీని పైన నవయుగ సంస్థ సమాధానం సైం పంపింది. ప్రస్తుతం వరద కారణంగా పోలవరం పనులు ముందుకు సాగటం లేదు. తిరిగి నవంబర్ నుండి పనులు ప్రారంభం కానున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి ప్రాజెక్టు అధారిటీ..కేంద్ర వాటర్ కమిషన్..కేంద్ర జల వనరుల శాఖ..ఏపీ ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. దాదాపు అయిదు గంటల పాటు చర్చ చేసారు. పోలవరం పనులు చేస్తున్న ఏజెన్సీల పని తీరు పైన అభ్యంతరాలు లేవని పీపీఏ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లటం ద్వారా ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని..నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉందని అధారిటీ హెచ్చరించింది. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది.

పీపీఏ సూచనలతో జగన్ ఏం చేస్తారు..

పోలవరం నిర్మాణంలో అధారిటీ కీలక పాత్ర పోషిస్తుంది. అధారిటీ ఇచ్చే నివేదికను కేంద్రం ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం పనుల్లో నవయుగ సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని సర్టిఫై చేయటంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం పదేపదే రివర్స్ టెండరింగ్ గురించి చెబుతూ..చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని నిరూపించి..ఖర్చు తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పుడు పీపీఏ వ్యక్తం చేసిన సందేహాలకు ఏపీ ప్రభుత్వం తమ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావటం.. పీపీఏ ఎండార్స్ చేసిన తరువాతనే కేంద్రం రీయంబర్స్ చేస్తోంది. దీంతో..ఏపీ నిర్ణయాలను పీపీఏ సైతం సమర్ధిస్తేనే..కేంద్రం ఆమోదించే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తమ నిర్ణయాల పైన ఏ రకంగా వ్యవహరిస్తారో చూడాలి. ఇదే సమయంలో ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు తీరు.. తదితర అంశాలపై సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here