సీసీ కెమెరాల ఆధారంగా దొంగల పట్టివేత

0
3


సీసీ కెమెరాల ఆధారంగా దొంగల పట్టివేత

పట్టుకున్న రాగి తీగను చూపుతున్న ఎస్సై

మద్నూర్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు నియంత్రికలను దొంగిలిస్తూ అందులో ఉన్న రాగి తీగలను సేకరించి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నట్లు మద్నూర్‌ ఎస్సై సాజిద్‌ తెలిపారు. శనివారం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దొంగలతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న రాగి తీగలను చూపారు. బిచ్కుందకు చెందిన కర్నాల్‌సింగ్‌, హింగోలి వాసులు దారాసింగ్‌, షంషేర్‌సింగ్‌లు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలలో సంచరిస్తూ వ్యవసాయ పొలాల వద్ద నియంత్రికలను పగులగొట్టి అందులో ఉన్న రాగి తీగలను దొంగిలిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సమావేశంలో ఏఎస్సై వెంకట్రావ్‌, సిబ్బంది ఉన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/129655.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here