సుష్మాస్వరాజ్‌కు నివాళులు

0
3


సుష్మాస్వరాజ్‌కు నివాళులు

సుష్మాస్వరాజ్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వెంటకరమణారెడ్డి,

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ మృతికి సంతాపంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు ఎదుట భాజపా నాయకులు బుధవారం సంతాపం తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఘనత ఆమెకు దక్కుతుందన్నారు. చిన్ననాటి నుంచి జాతీయ భావాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ తేలు శ్రీనివాస్‌, మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు పుల్లూరి జ్యోతి, నాయకులు కుంట లక్ష్మారెడ్డి, రాజలింగం, వెంకట్‌రెడ్డి, నరేష్‌, శ్రీకాంత్‌, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

భాజపా జిల్లా కార్యాలయంలో

జిల్లా కార్యాలయంలో

భాజపా జిల్లా కార్యాలయంలో సుష్మాస్వరాజ్‌ మృతికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు హాజరై మాట్లాడారు. దేశానికి ఆమె చేసిన సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో మోర్చా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌, పట్టణాధ్యక్షుడు భానుప్రకాష్‌, నాయకులు బాలకిషన్‌, సురేష్‌, శ్రీకాంత్‌, ప్రదీప్‌, స్వామి, చంద్రంయాదవ్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నారం(రామారెడ్డి), సుష్మాస్వరాజ్‌ అందరికి ఆదర్శనీయమని యువకులు పేర్కొన్నారు. బుధవారం అన్నారం గ్రామంలో సుష్మాస్వరాజ్‌ మృతిపై శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలోనే ఉత్తమ మహిళా నేత అని, విదేశాంగమంత్రిగా విశేష సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో బాలస్వామి, శ్రీకాంత్‌, కార్తిక్‌, చిన్నస్వామి, గౌస్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ: దోమకొండ భాజపా నాయకులు బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింతల రాజేశ్‌, నాయకులు భూపాల్‌లక్ష్మణ్‌, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here