సూపర్.. అసలేమిటిది?: సీ-వాటర్ డిశాలినేషన్ ప్లాంట్ నీరు తాగిన జగన్

0
6


సూపర్.. అసలేమిటిది?: సీ-వాటర్ డిశాలినేషన్ ప్లాంట్ నీరు తాగిన జగన్

ఇజ్రాయెల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఇజ్రాయెల్ పర్యటనలో ఆదివారం నాడు హడేరాలోని హెచ్‌2ఐడీ డిశాలినేష్ ప్లాంటును సందర్శించారు. ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ ఇది. ఆయన వెంట్ టెల్ అవీక్‌లోని భారతీయ మిషన్ ఉప అధిపతి షెరింగ్ ఉన్నారు.

ప్లాంట్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్

హడేరా చేరుకున్న జగన్‌కు సముద్రపు నీటి నుంచి ఇప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై సంబంధిత ప్లాంట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంచినీటిని తయారు చేసే ప్రక్రియను, ప్లాంటు నెలకొల్పడానికి అయ్యే ఖర్చును, ఇతర అంశాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు.

నీరు తాగిన జగన్

నీరు తాగిన జగన్

ప్లాంట్ అధికారులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్. ఈ ప్రాజెక్టుకు అయ్యే మూలధన, నిర్వహణ వ్యయాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా తయారు చేసిన నీటిని జగన్ తాగి, నాణ్యత, రుచి బాగున్నాయని కితాబిచ్చారు. జగన్ ప్లాంట్ అంతా కలియదిరిగి పరిశీలించారు. మంచినీటి ప్రక్రియలో విభిన్న దశలను చూశాక అధికారులను అభినందించారు.

రెండు ప్లాంట్స్‌గా...

రెండు ప్లాంట్స్‌గా…

హడేరా ప్రాజెక్టుప్రాజెక్టు రెండు ప్లాంట్స్‌గా ఉంటాయి. ఈస్టర్న్, అండ్ వెస్టర్న్. ఈ రెండు ప్రాజెక్టులు కూడ సమాన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేటికవే ఇండిపెండెంట్‌గా ఆపరేట్ అవుతాయి. హడేరా ప్లాంటులోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షామీర్ ఈ ప్లాంటు సందర్శనకు ఏర్పాటు చేశారు.

ఇలా చేస్తాం....

ఇలా చేస్తాం….

ఒకరోజుకు 3.38 లక్షల క్యూబిక్ మీటర్ల మంచి నీటిని ఉత్పత్తి చేసే విధంగా ఈ ప్లాంటును తయారు చేశారు. ఆ తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 4.6 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచారు. నీటి కొరతను అధిగమించేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. సముద్రపు నీటిని డిశాలినేట్ చేయడానికి ప్రీ ట్రీట్మెంట్ మొదటి దశ అని ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ జగన్‌కు వివరించారు. ఇది ఉప్పు అవపాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని, దీనికి ప్రజెర్ ఎక్స్‌చేంజ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రీట్రీట్మెంట్ కచ్చితంగా అవసరమని అదికారులు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here