సూపర్ ఫాస్ట్ ఇండియా: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మరింత పైకి

0
2


సూపర్ ఫాస్ట్ ఇండియా: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మరింత పైకి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) విధానాలలో అత్యధికంగా మెరుగుపర్చిన టాప్ 20 దేశాల్లో భారత్ నిలిచింది. 2017లో 190 దేశాల్లో భారత్ 100వ స్థానంలో నిలిచింది. 2018లో 77వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరానికి గాను ప్రస్తుతానికి అదే స్థానంలో ఉంది. వచ్చే నెల (అక్టోబర్ 24) జాబితా విడుదల కానుంది. కానీ విధానాలు మెరుగుపర్చిన దేశాల్లో భారత్ ముందుంది. ఈజా ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరిచేందుకు భారత్‌తో పాటు చైనా 13 సంస్కరణలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో రానున్న జాబితాలో భారత్ ర్యాంకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్‌ 24న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ప్రపంచ బ్యాంకు తుది జాబితాను విడుదల చేయనుంది. బిజినెస్ ప్రారంభం, దివాలా చట్టం, నిర్మాణ రంగంలో పరిమితులు వంటి సంస్కరణలపై మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ర్యాంకింగ్ మెరుగుపడటానికి దోహదం చేస్తున్నాయి.

మే 2019తో ముగిసిన ఏడాది కాలానికి గాను ఆయా దేశాలు తీసుకున్న చర్యలు ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ప్రారంభ కంపెనీలపై విధిస్తున్న పన్నును రద్దు చేయడం, ఆన్‌లైన్‌ ద్వారా అన్ని అనుమతులు లభించడం, మౌలిక వసతులు, రేవుల అప్ గ్రేడింగ్‌ వంటివి మరింత సులభతరమైనట్లు ట్రేడర్స్ తెలిపారు.

వ్యాపార సానుకూలతలపై నరేంద్ర మోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెబుతున్నారు. దీంతో గత ఏడాది భారత్ 23 స్థానాలు ఎగబాకింది. భవిష్యత్తులో భారత ర్యాంకింగ్ టాప్ 50కి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితం కనిపిస్తోందని, గత కొన్నాళ్లుగా భారత్ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చిందని ప్రపంచబ్యాంకు తెలిపింది. కాగా, భారత్, చైనా 13 వరకు సంస్కరణలు తీసుకు వస్తే, పాకిస్తాన్ ఆరు విభాగాల్లో మెరుగైంది.

మరోవైపు, టర్కీ, ఆఫ్గనిస్తాన్‌లు ఈ జాబితాలో మొదటిసారి కనిపిస్తున్నాయి. చైనా, టోగో, కెన్యా, రువాండాల్లోను ఇంప్రూమెంట్ కనిపించింది. ఇటీవలి ర్యాంకింగుల్లో అత్యధికంగా మెరుగుపడిన దేశాల్లో ఆఫ్గనిస్తాన్. ఈ దేశాలన్నీ 62 విభాగాల్లో సంస్కరణలు చేపట్టాయి.

ఆఫ్గనిస్తాన్ క్రితంసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 167 స్థానంలో ఉండగా విధానాలపరంగా మెరుగుపరిచిన జాబితాలో టాప్‌లో ఉంది. టోగో 137వ స్థానంలో ఉండగా విధానాలపరంగా ఈసారి మెరుగుపడింది. ఆఫ్గనిస్తాన్, చైనా, ఇండియా, టోగో, కెన్యా, టర్కీ, రువాండా వంటి వివిధ దేశాలు విధానాల మార్పుల్లో 4 శాతం నుంచి 10 శాతం వరకు స్కోర్ సాధించాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here