సెంచ‌రీతో జ‌ట్టును గెలిపించినా విసుర్లు త‌ప్ప‌ట్లేదు! కివీస్ కేప్టెన్‌పై ప్రొటీస్ మాజీల విమ‌ర్శ‌లు

0
3


ఎడ్జ్‌బాస్ట‌న్‌: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్‌లో బుధ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ కేప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. ఒంటిచేత్తో జ‌ట్టును గెలిపించాడు. వ‌రుస‌గా వికెట్లు కోల్పోతున్న‌ప్ప‌టికీ.. స‌హ‌నంతో బ్యాటింగ్ చేశాడు. క్రీజులో పాతుకుపోయాడు. 138 బంతుల్లో 106 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌లో నిలిపాడు.

ఇంతా చేసిన‌ప్ప‌టికీ.. విలియ‌మ్స‌న్‌పై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. నైతిక విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చాడ‌ని ఆడిపోసుకుంటున్నారు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ మాజీ ఆట‌గాళ్లు. స్పోర్టివ్‌నెస్ లేద‌ని అంటున్నారు. దీనికి కార‌ణాలు లేక‌పోలేదు.

ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో ఓ బంతిని స్క్వేర్ క‌ట్ ఆడ‌బోయిన కేన్ విలియ‌మ్స‌న్ మిస్ అయ్యాడు. బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. బ్యాట్ అంచుల‌ను ముద్దాడుతూ వెళ్లి, వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ చేతుల్లో ప‌డింది. విలియ‌మ్స‌న్ అవుట్ అయిన‌ట్టు డికాక్, తాహిర్ స‌హా ఆట‌గాళ్లంద‌రూ గ‌ట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ అవుట్ ఇవ్వ‌లేదు. ద‌క్షిణాఫ్రికా కేప్టెన్ డుప్లెసిస్ గానీ ఇత‌ర ఆట‌గాళ్లు గానీ రివ్యూ కోరి ఉంటే ప‌రిస్థితి వేరులా ఉండేది. ఎందుకంటే- బంతి బ్యాట్ లంచుల‌ను తాకింది. రివ్యూ కోర‌క‌పోవ‌డంతో విలియమ్స‌న్ బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు. జ‌ట్టును గెలిపించుకోగ‌లిగాడు.

ఇదే విష‌యాన్ని లేవ‌నెత్తుతున్నారు ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాళ్లు. బంతి బ్యాట్ అంచుల‌ను తాకిన విష‌యం విలియ‌మ్స‌న్‌కు తెలిసే ఉంటుందని, అంపైర్ అవుట్ ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. ఆయ‌న స్వ‌చ్ఛందంగా క్రీజును వ‌దిలి ఎందుకు వెళ్ల‌లేద‌ని ప్రొటీస్ జ‌ట్టు మాజీ స్పిన్న‌ర్ పాల్ ఆడ‌మ్స్ ప్ర‌శ్నిస్తున్నాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా విలియ‌మ్స‌న్ ప్ర‌వ‌ర్తించాడ‌ని విమ‌ర్శిస్తున్నాడు. ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న ఆట‌గాడిగా, సాంకేతికంగా అత్యున్న‌త బ్యాటింగ్ బ‌లం ఉన్న కేన్ విలియ‌మ్స‌న్ వంటి ఆట‌గాడు చేయాల్సిన ప‌ని కాద‌ని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here