‘సెక్స్ ఇష్టం లేదు, అందుకే అంతమందిని చంపేశా’

0
5


ది ఏప్రిల్ 23, 2018.. రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలోకి ఓ వ్యాన్ వేగంగా దూసుకొచ్చింది. జనాలను గుద్దుకుంటూ.. తొక్కుకుంటూ వెళ్లింది. అయితే, అది ప్రమాదం కాదు. ఓ ఉన్మాది సృష్టించిన విధ్వంసం. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. వీరిలో 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు.

Read also: చెరువులో కారు, అందులో అస్థిపంజరం.. ‘గూగుల్ ఎర్త్’తో 22 ఏళ్ల మిస్టరీ వీడిందిలా!

ఈ దారుణానికి పాల్పడిన ఆ నిందితుడు అలెక్ మినాస్సియన్(26)ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అతడి మీద 10 హత్య కేసులు, 16 హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. విచారణలో అతడు కొన్ని షాకింగ్ నిజాలు చెప్పాడు. తనకు సెక్స్ అంటే ఇష్టం లేదని, ఆ పేరు వింటేనే ఫ్రస్ట్రేషన్‌కు గురవ్వుతానని తెలిపాడు. ఈ సందర్భంగా తాను సోషల్ మీడియాలో ‘సెక్సువల్ ఫ్రస్ట్రేషన్’ గ్రూపులో చేరానన్నాడు. ‘‘నాకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు. నేను ఇప్పటికీ వర్జిన్‌నే. ఎవరైనా జంటగా కనిపిస్తే.. వాళ్లను చంపేయాలన్నంత కోపం వచ్చేది. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకే.. వ్యాన్‌ను ఆయుధంగా చేసుకుని హత్యాకాండకు పాల్పడ్డాను’’ అని అలెక్ వెల్లడించాడు.

Read also:
150 మంది దారుణ హత్య.. డంపింగ్ యార్డులో ఎముకల గుట్ట!

తాను ఒంటరితనంతో బాధపడుతున్నానని, ఇప్పటి వరకు సెక్స్ సుఖం కూడా తెలియని వర్జిన్ అని తెలిపాడు. ఈ హత్యాకాండకు ముందు కాలిఫోర్నియాలో ప్రేమను తిరస్కరించిందనే కారణంతో మహిళను హత్య చేసిన హంతకుడిని కలిశానని చెప్పాడు. అతడి సాయంతో తాను ఓ వ్యాన్‌ను అద్దెకు తీసుకుని.. ఈ హత్యకాండాకు పాల్పడ్డానని తెలిపాడు. ఫిబ్రవరి నెలలోనే అలెక్ ఈ వివరాలు పోలీసులకు చెప్పినా, మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here