సెప్టెంబర్ 17న బీజేపి కీలక అడుగులు..! గులాబీ పార్టీ టార్గెట్ గా కమలం కార్యాచరణ..!!

0
0


సెప్టెంబర్ 17న బీజేపి కీలక అడుగులు..! గులాబీ పార్టీ టార్గెట్ గా కమలం కార్యాచరణ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం తర్వాత బీజేపి అదిష్టానం తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విమోచన దినాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 17న ఏం జరిగింది, హైదరాబాద్ సంస్థానం విలీనంలో బీజేపి పాత్ర ఎంతవరకు ఉంది అనే అంశాలను ప్రజలకు వివరించానుకుంటోంది బీజేపి. అందులో భాగంగా జాతీయ వాదం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తాజా అస్త్రమిది.

కశ్మీర్ ను రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి 70 ఏళ్ల రావణ కాష్టాన్ని పరిష్కరించిన బీజేపీ సర్కారుపై దేశవ్యాప్తంగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రతిసారి ఎత్తి చూపే కశ్మీర్ ను సంపూర్ణంగా భారత్ లో విలీనం చేసే మోధీ ఎత్తుగడకు దేశ ప్రజలంతా మద్దతు పలికారు. ఈ పరిణామం దేశంలోని ప్రజల్లో దేశభక్తిని తట్టి లేపింది. జాతీయ భావాన్ని బలంగా మార్చుకుంటున్న బీజేపీ, ఇప్పుడు వచ్చే నెలలో అదే ఆయుధంతో తెలంగాణపై గురిపెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినం.. బీజేపీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపిన రోజు అది. అందుకే దానిని క్యాష్ చేసుకోవడంతోపాటు తెలంగాణలో బలపడాలని బీజేపీ వ్యూహం రిచిస్తోంది. తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ తన ఆయుధంగా మార్చుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యూహ రచన చేశారు.

యన త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి – జెండా ఎగురవేయడానికి ఆహ్వానించనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటే… ఇక్కడి ప్రజల్లో బీజేపీపై సానుకూల వాతావరణం రావచ్చని.. అదే సమయంలో టీఆర్ ఎస్-మజ్లిస్ కు ప్రత్యామ్మాయంగా బీజేపీ ఉందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించొచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 17 తరువాత తెలంగాణలో రాజకీయాలు ఎంతటి వేడిగా ముందుకు సాగుతాయో చూడాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here