సెప్టెంబర్ 30లోగా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే..? లింకింగ్ ఇలా…

0
2


సెప్టెంబర్ 30లోగా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే..? లింకింగ్ ఇలా…

ఆధార్ కార్డు – పాన్ కార్డును ఈ నెల (సెప్టెంబర్) 30వ తేదీలోపు లింక్ చేసుకోవాలి. కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెలాఖరులోగా ఆధార్ – పాన్ లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి సెప్టెంబర్ 30 తేదీలోగా అంటూ ఆఖరి గడువిచ్చారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పాన్ లేదా ఆధార్ ఉపయోగించవచ్చు. ఇవి ఇంటర్‌ఛేంజబుల్.

ఐటీ డిపార్టుమెంట్ ఈ-ఫైలింగ్ ద్వారా లింక్ చేసుకోవచ్చు

12 అంకెల ఆధార్ కార్డుతో 10 అంకెల పాన్ కార్డును అనుసంధానం చేసుకోవడం చాలా సులభం. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు చెందిన ఈ-ఫైలింగ్ వెబై సైట్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పోర్టల్ ద్వారా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక, కొత్తగా పాన్ కార్డు తీసుకుంటున్న వారు కచ్చితంగా తమ ఆధార్ నెంబర్‌ను పేర్కొనవలసి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఎలా?

ఆన్‌లైన్‌లో ఎలా?

– ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ వెబ్ సైట్‌కు వెళ్లాలి.

– పాన్ (యూజర్ ఐడీ), పాస్ వర్డ్, మీ పుట్టిన తేదీని పేర్కొని లాగిన్ కావాలి.

– Link Aadhaar ఆప్షన్ ఎంచుకోవాలి.

– పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్‌లోని పేరు వంటి వివరాలు ఎంటర్ చేశాక కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

– ఆ తర్వాత LINK Aadhaar పైన క్లిక్ చేయాలి.

– లింక్ అయినట్లుగా చూపిస్తుంది.

ఒకవేళ లింక్ కాకుంటే...

ఒకవేళ లింక్ కాకుంటే…

ఒకవేళ మీ పాన్ – ఆధార్ లింక్ కాకుంటే ఓ ఫామ్ కనిపిస్తుంది. అక్కడ మీ వివరాలను నమోదు చేయాలి. పాన్ కార్డ్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, లింగం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్. కాప్చాను ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత సక్సెస్ మెసేజ్ వస్తుంది.

ఎస్సెమ్మెస్ ద్వారా...

ఎస్సెమ్మెస్ ద్వారా…

ఎస్సెమ్మెస్ ద్వారా కూడా పాన్ – ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్ సందేశం పంపించడం ద్వారా లింక్ చేసుకోవచ్చు.

UIDPAN ఎంటర్ చేసి 567678 కు లేదా 56161 ఎస్సెమ్మెస్ చేయాలి.

ఇలా పంపించినందుకు ఎలాంటి ఛార్జీ ఉండదు.

మ్యాన్యువల్ లింకింగ్

మ్యాన్యువల్ లింకింగ్

సమీపంలోని పాన్ సర్వీస్ ప్రొవైడర్, ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్‌కు వెళ్లాలి. అక్కడ అనెక్స్యూర్-1 ఫామ్ నింపవలసి ఉంటుంది. పాన్, ఆధార్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఆన్ లైన్ ద్వారా అయితే ఉచితం. కానీ మ్యాన్యువల్ లింకింగ్ అయితే ఛార్జీ వసూలు చేస్తారు. లింకింగ్, కరెక్షన్‌ను బట్టి ఛార్జీలు వర్తిస్తాయి.

పాన్ కార్డులోని కరెక్షన్‌కు రూ.110, ఆధార్ కరెక్షన్‌కు రూ.25 ఛార్జ్ ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here