సైక్లింగ్‌ క్రీడాకారుల సత్తా

0
3


సైక్లింగ్‌ క్రీడాకారుల సత్తా

క్రీడాకారిణులను అభినందిస్తున్న కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు

నిజామాబాద్‌ ఖిల్లా, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి రోడ్‌ రేస్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన జిల్లా సైక్లిస్టులను కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు బుధవారం ప్రశంసించారు. ఈ నెల 25, 26 తేదీల్లో మెదక్‌జిల్లా రామాయంపేటలో జరిగిన పోటీల్లో జిల్లా సైక్లిస్టులు శ్రీముఖి, మోధారెడ్డి, యశ్వంత్‌కుమార్‌ లు మొత్తం నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి భూలోకం విజయ్‌కాంత్‌రావు, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌, కుస్తీ సంఘం కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కబడ్డీ పోటీలకు హాజరుకావాలి

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: వచ్చే నెల 2న అండర్‌- 14 బాలబాలికల విభాగంలో నిర్వహించే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు క్రీడాకారులు హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(బాల్కొండ)లో నిర్వహించే పోటీల్లో జోన్‌ జట్లు మాత్రమే పాల్గొనాలని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్‌ తీసుకురావాలని సూచించారు.

జూడో ఎంపికలకు..

జూడో జిల్లా స్థాయి పోటీలు, ఎంపికలకు అండర్‌-14, 16 బాలుర విభాగంలో ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ తెలిపారు. వచ్చే నెల 2న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని స్విమింగ్‌ పూల్‌లోని హాల్‌లో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్‌లతో హాజరుకావాలని సూచించారు.

హాకీ..

హాకీ అండర్‌- 17 బాలికల విభాగంలో జిల్లా స్థాయి పోటీలు, ఎంపికలకు హాజరుకావాలని తెలిపారు. వచ్చే నెల 2న ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో చేపట్టే ఎంపికలకు ఉదయం 10 గంటలకు బోనఫైడ్లతో హాజరుకావాలని క్రీడాకారులకు సూచించారు.

ధ్రువపత్రాలతో …

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: కరాటే అండర్‌- 17 బాలబాలికల విభాగంలో ఎంపికైన క్రీడాకారులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 1న జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో ఉదయం 10 గంటలకు బోనఫైడ్‌, జనన ధ్రువీకరణ, ఆధార్‌, గతేడాది మార్కుల పత్రాలు, నాలుగు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.

3న జిల్లా స్థాయి యోగాసన పోటీలు

నిజామాబాద్‌ ఖిల్లా, న్యూస్‌టుడే: జిల్లా యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నవంబరు 3న 33వ జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బాలశేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌ జూనియర్‌(8- 14 బాలబాలికలు), జూనియర్‌ (14- 20 బాలబాలికలు), సీనియర్స్‌(20- 30 యువత), ఎల్డర్‌ గ్రూప్‌(30- 40 ఏళ్లవారు) విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. జిల్లా కేంద్రంలోని తిలక్‌ గార్డెన్‌రోడ్డులోని సింధి భవన్‌లో ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తామని, ఔత్సాహికులు నవంబరు 2వ సాయంత్రం 6 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు చరవాణి సంఖ్య 94400 31945లో సంప్రదించాలని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

పోచంపాడ్‌(మెండోరా), న్యూస్‌టుడే: మెండోరా మండలం పోచంపాడ్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఫణీంద్ర రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు మనోహర్‌ బుధవారం తెలిపారు. నవంబరులో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటాడని చెప్పారు.

జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

రామారెడ్డి, న్యూస్‌టుడే: ఉప్పల్‌వాయి ఉన్నత పాఠశాలలో నవంబరు 5న జిల్లా స్థాయి అండర్‌-17 ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్‌ ఇన్‌ఛార్జి తారాచంద్‌ తెలిపారు. 2003 జనవరి ఒకటి లోపు జన్మించిన క్రీడాకారులు అర్హులని చెప్పారు. పోటీల్లో పాల్గొనే వారు మంగళవారం ఉదయం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డిని సంప్రదించాలని సూచించారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో వెండి పతకాలు

ఆలూర్‌(ఆర్మూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: మండలంలోని ఆలూర్‌ మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ప్రతిభ చాటారని ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌ బుధవారం తెలిపారు. నిర్మల్‌లో ఈ నెల 27 నుంచి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అండర్‌-14, అండర్‌-17 విభాగంలో అబ్దుల్‌ రెహమాన్‌, భాను ప్రసాద్‌, సోఫియన్‌ ఇక్బాల్‌ వెండి పతకాలు సాధించారు. వీరిని వ్యాయామ ఉపాధ్యాయుడు రాజ్‌భూపతి, ఉపాధ్యాయులు అభినందించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here