‘సైరా’కి ఫుల్ బజ్.. పవన్ రికార్డ్‌ని చిరు దాటతాడా?

0
4


రేనాటి వీరుడు, తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సైరాగా తెరకెక్కించారు. ఎప్పటినుండో చిరంజీవి చెయ్యాలి అనుకున్న కథ ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంది. చిరంజీవి చిరకాల స్వప్నం ఇప్పుడు రియాలిటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా తన ప్రతాపం చూపిస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ట్రైలర్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా సానుకూలత వచ్చింది. ఇక సినిమా టీమ్ అంతా కూడా సైరా గ్రాండియర్‌గా ఉంటుంది అని కాకూండా ఈ సినిమా కథ గురించి, ఈ సినిమాలో అందరి మనసులకు హత్తుకునే దేశభక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీంతో ఈ సినిమాకి ఓవర్సీస్‌లో సైతం భారీ రెస్పాన్స్ వస్తుంది.

Also Read: బాక్సాఫీస్ డిజాస్టర్‌గా ‘ప్రస్థానం’.. షాకిస్తున్న వసూళ్ళు

ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి ట్రెండ్ మాత్రం సూపర్ పాజిటివ్‌గా ఉంది. ఏమీ ఆఫర్స్ లేకుండానే ఈ సినిమా అక్కడ ఆల్రెడీ లక్ష డాలర్స్ కలెక్ట్ చేసింది. అది కూడా చాలా తక్కువ ఏరియాలనుండి వచ్చిన అప్డేట్స్ మాత్రమే. ఇంకా ఆఫర్స్ స్టార్ట్ అయితే అప్పుడు బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కేవలం ప్రీమియర్స్ తోనే ఏకంగా మిలియన్ డాలర్స్‌కి పైగా కొల్లగొట్టింది. కానీ ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్స్‌తోనే 1.5 డాలర్స్ మార్క్‌ని క్రాస్ చేసింది. అయితే ఖైదీ నంబర్ 150కి ఉన్న ఏకైక ఆకర్షణ చిరంజీవి మాత్రమే. కానీ ఇప్పుడు సైరాకి మాత్రం చెప్పుకోవడానికి చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి.

Also Read: చైతూ కంప్లీట్ హస్బెండ్ మెటీరియల్.. ఎన్టీఆర్‌తో చాలా కష్టం: సమంత

ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో బాహుబలి -2 టాప్‌లో కొనసాగుతుంది. సైరా ఆ రికార్డ్‌ని టచ్ చెయ్యడం కష్టమే కానీ దాని తరువాత సెకండ్ ప్లేస్‌లో నిలిచే అంశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. సైరా ప్రీమియర్స్‌తో రెండు మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఆ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినాకూడా మెగా స్టార్ ప్రభంజనంతో సైరా అద్భుతాలు సృష్టిస్తుంది.మొత్తానికి ఈసారి మాత్రం పవర్‌స్టార్ రికార్డ్‌ని మెగాస్టార్ బ్రేక్ చెయ్యడం అనేది ఆల్మోస్ట్ ఫిక్స్. అదేకనుక జరిగితే ఆల్ టైమ్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో చిరంజీవి రెండు సినిమాలు నిలుస్తాయి.మెగా ఫ్యామిలీ నుండి మొత్తం అయిదు సినిమాలు ఈ టాప్ 10 లిస్ట్ లో చోటు సంపాదించుకుంటాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here