‘సైరా’లో పరుష పదాలు.. మ్యూట్‌తో మెగా అభిమానులకు నిరాశే!

0
3


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఈ విషయాన్ని మూడు రోజుల క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. కానీ, సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం గురువారం వరకు నిర్మాత రామ్ చరణ్‌కు అందలేదు. దీనికి కారణం, సెన్సార్ సభ్యులు కొన్ని కరెక్షన్స్ చెప్పడమే.

ప్రస్తుతం సినీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. ‘సైరా’ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మొత్తం ఏడు మార్పులు చేయాలని సూచించారు. ఈ ఏడు మార్పుల్లో ‘తొలి యుద్ధం’ అనే పదం కూడా ఉందట. అలాగే, కొన్ని బూతు పదాలను వినిపించకుండా (మ్యూట్) చేయాలని సూచించినట్లు తెలిసింది. ‘ల*జల’, ‘ఫ* ఆఫ్’, ‘ఫ*’, ‘బా*ర్డ్’ వంటి పరుష పదాలను మ్యూట్ చేశారని విశ్వసనీయ సమాచారం.

వాస్తవానికి ‘సైరా’లో ఇలాంటి పరుషమైన పదాలు చాలానే ఉన్నాయట. అయినప్పటికీ సెన్సార్ బోర్డు వాటిని తొలగించాలని సూచించలేదు కానీ కొన్నిటిని మ్యూట్ చేయాలని చెప్పిందని తెలిసింది. హీరో మంచి ఎమోషన్‌తో డైలాగ్ చెప్పేటప్పుడు అందులో కొన్ని పదాలు మ్యూట్ అయితే చాలా చికాకుగా అనిపిస్తుంది. ఈ విషయంలో మెగా అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. కాగా, సినిమా నిడివి 170 నిమిషాల 50 సెకెన్లు. అంటే 2 గంటల 50 నిమిషాలన్న మాట. ఈ సెన్సార్ సర్టిఫికెట్‌ను ఇప్పటికే నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్‌లో ఉంచింది.

Also Read: పూరి పెద్ద మనసు.. ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, కో-డైరెక్టర్లకు సాయం

ఇదిలా ఉంటే, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క శెట్టి వంటి స్టార్లు నటించిన ఈ చిత్రాన్ని సుమారు రూ.270 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మించారు. అమితి త్రివేది ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here