‘సైరా’ ట్రైలర్ 2: గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు

0
3


మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చేనెల 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలవుతోంది. ఇప్పటికే విడులైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.

Also Read: ముందురావడానికి నో అంటున్న బన్నీ, మహేష్.. దోబూచులాట

సినిమాలోని ప్రధానమైన యుద్ధ సన్నివేశాలను మచ్చుకగా చూపిస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ట్రైలర్‌లో చిరంజీవి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే వెండితెరపై నరసింహారెడ్డి సమరసింహపై ఆంగ్లేయులను చీల్చి చండాలడం ఖాయంగా కనిపిస్తోంది.

‘‘ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్స్‌లని 300 పర్సంట్ పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ల బంగారంతో తిరిగిరావాలి’’ అని బ్రిటిష్ ఆఫీసర్ చెప్పే మాటలతో ట్రైలర్ మొదలైంది. ఆ వెంటనే.. ‘‘అది మనది, మన ఆత్మగౌరవం, గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు’’ అంటూ నరసింహారెడ్డి డైలాగ్ వచ్చింది. మొత్తానికి ఈ ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మొత్తం ఆంగ్లేయులపై నరసింహారెడ్డి సమరాన్నే ఈ ట్రైలర్‌లో చూపించారు. సినిమాపై అంచనాలను మరింత పెంచారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here