‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి వీడియో.. మెగా హీరోలంతా ఒకే చోట

0
7


హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కళ్లు మిరిమిట్లు గొలిపే తీరులో ఆదివారం రాత్రి ఈ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. లక్షలాదిగా అభిమానులు హాజరయ్యారు. మెగా అభిమానులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. ఈ వేడుకకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి, మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్, దర్శకుడు కొరటాల శివ అతిథులుగా విచ్చేశారు. అయితే, వీరితో పాటు మెగా హీరోలంతా ఈ వేడుకలో సందడి చేశారు.

మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, వైష్టవ్ తేజ్ పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సుమ, హేమంత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

కాగా.. స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, నయనతార, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు.

సుమారు రూ.270 కోట్ల భారీ బడ్జెత్‌తో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here